బిగ్ బాస్( Bigg Boss )సీజన్ సెవెన్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టినటువంటి వారిలో రతిక ( Rathika ) ఒకరు.ఈమె ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడే ఎంట్రీ ఇచ్చారు అయితే ఈమె మొదట రెండు వారాలు ఎంతో అద్భుతంగా తన ఆట తీరును కనబరచడంతో తప్పకుండా టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ భావించారు.
కానీ ఆ తర్వాత ఈమె తన స్వార్థం కోసం కంటెస్టెంట్లను వాడుకోవడం మొదలుపెట్టారు.అయితే ఈమె వ్యవహార శైలి నచ్చనటువంటి అభిమానులు తనని హౌస్ నుంచి బయటకు పంపించాలని నిర్ణయం తీసుకొని నాలుగవ వారం హౌస్ నుంచి బయటకు పంపించారు.

ఇలా మొదటి నాలుగు వారాలకి హౌస్ నుంచి రతిక ఎలిమినేట్ అయినప్పటికీ వైల్డ్ కార్డు ఎంట్రీ( Wild Cars Entry ) ద్వారా ఆరో వారం తిరిగి హౌస్ లోకి అడుగుపెట్టారు.ఇక ఇప్పుడైనా తన ఆట తీరును మెరుగుపరుచుకుంటుందని అందరూ భావించారు కానీ ఈమె అలాగే తన ఆట తీరును ప్రదర్శించడంతో ఇప్పుడు కూడా టాప్ ఫైవ్ లో కొనసాగలేక 12వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇక ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉండడంతో శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈ ఆరు వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి రతిక ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ( Remuneration )తీసుకుందనే విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈమె తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే సమయానికి పలు సినిమా అవకాశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈమె వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున తన రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట.ఇలా వారానికి రెండు లక్షల రూపాయలు అడగడంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తనకు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని ఇలా ఆరువారాల పాటు హౌస్ లో కొనసాగినటువంటి రతిక 12 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక ఈమెకి ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పాలి.