వారికి పొగడటమే తెలుసు....!

పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు పాలకులను సాధారణంగా విమర్శించరు.ఎక్కడో ఒకరిద్దరు ఉంటే ఉడొచ్చేమో.

బడా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు, కార్పొరేట్‌ సంస్థల అధిపతులకు లాభాలు సంపాదించుకోవడమే ప్రధానం.వారికి ఒక రాష్ర్టం మీద ప్రేమ, మరో రాష్ర్టం మీద ద్వేషం ఉండవు.

అంతర్గతంగా పార్టీ అభిమానాలు ఉంటాయోమోగాని బయటకు చెప్పరు.అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పాలకులకు దగ్గరగా ఉంటారు.

వారిని బుట్టలో వేసుకొని తమ పనులు చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు.పెట్టుబడులు పెడతారు.

Advertisement

ప్రభుత్వాలను మచ్చిక చేసుకొని భూములు, రాయితీలు సంపాదిస్తారు.పాలకులు కూడా పారిశ్రామికవేత్తలను, బడా వ్యాపారులను ప్రేమగా చూస్తారు.

ఎందుకంటే పార్టీకి నిధులు సమకూర్చేది వారే కదా.పాలకులకు కూడా వ్యాపారాలు, పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఒకరికొకరు సత్సంబంధాలతో వ్యవహరిస్తారు.పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు హాని చేసే విధానాలు ఏ ప్రభుత్వమూ ప్రవేశపెట్టదు.

ప్రభుత్వాలు సామాన్యుల మీద పన్నుల భారం వేయడానికి వెనకాడవు.కాని పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తాయి.

స్కూళ్లు, మరుగుదొడ్లు, రోడ్లు మొదలైనవి నిర్మించడానికి ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కపెడతాయి.కాని విమానాశ్రాలయాలను వెంటనే ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

ప్రభుత్వాలు సంపన్నులకు ఏ లోటూ చేయవు కాబట్టే వారు పాలకులను ప్రశంసిస్తూ ఉంటారు.ఇదంతా ఎందుకు చెప్పుకోవల్సి వచ్చిందంటే .ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసలతో ముంచెత్తారు.విజయవాడలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన టాటా, బాబు పనితీరు బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నారు.

Advertisement

బాబు తన లక్ష్యాలు సాధించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.ఏపీలో తమ పెట్టుబడులను ఆక్వా, ఫిషరీస్‌ రంగాలకే పరిమితం చేయబోమని, అనేక రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారు.

రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్న టాటా ట్రస్టు ఏపీలోని రెండొందల అరవై నాలుగు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది.ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం-ట్రస్టు మధ్య ఒప్పందం కుదిరింది.

విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని గ్రామాలను టాటా ట్రస్టు అభివృద్ధి చేస్తుంది.

తాజా వార్తలు