టాటా నానోలో తాజ్ హోటల్ కు విచ్చేసిన రతన్ టాటా.. సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా..!

టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా సింప్లిసిటీ మరోసారి బయటపడింది.తాజాగా రతన్ టాటా ఎలాంటి బాడీగార్డులు పక్కన లేకుండా తన తాజ్ హోటల్ కి వెళ్లారు.

 Ratan Tata Arrives At The Taj Hotel In A Tata Nano , Tata Motors, Taj Hotel, R-TeluguStop.com

అది కూడా టాటా నానో కారులో! రతన్ టాటా తలుచుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుగాట్టీ, మెర్సిడెస్ వంటి కార్లలో తిరగగలరు.కానీ ఆయన మాత్రం చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ అందరి మనసులను గెలుచుకున్నారు.

రతన్ టాటా నానో కారులో తాజ్ హోటల్ కార్యక్రమానికి హాజరు కాగా హోటల్ సిబ్బంది అతన్ని గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

14 ఏళ్ల క్రితం నానో కారు విడుదల అయ్యింది.ఈ కారును ఇప్పుడు ఎవరూ కొనుగోలు చేయడం లేదు.నిజానికి 2019లో కేవలం ఒకే ఒక్క నానో కారు మాత్రమే అమ్ముడు పోయింది.2019 సంవత్సరంలోనే ఈ కారు ఉత్పత్తిని నిలిపేశారు.అయితే ఈ బుల్లి కారంటే రతన్ టాటాకి చాలా ఇష్టం.మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నపిల్లల కోసమే రతన్ టాటా ఈ కారును తీసుకొచ్చారు.ధనవంతులు కాకపోయినా మధ్య తరగతి పిల్లలు కూడా కారులో తిరగాలనే తన కలను టాటా నానో కారు ద్వారా ఆయన తీర్చుకోవాలనుకున్నారు.అయితే ఇప్పుడు ఆయన కల కలగానే మిగిలిపోయింది.

అయినా టాటా తన నానో కారుపై ప్రేమను వదులు కోలేదు.తాజాగా ఇది మరొక సారి నిరూపితమయింది.

టాటా గ్రూప్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శంతాను నాయుడు రతన్ టాటాను నానో కారులో తాజ్ హోటల్ వద్దకు తీసుకెళ్లారు.

Telugu Latest, Netizens, Ratan Tata, Simplicity, Taj Hotel, Tajhotel, Tata Motor

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు ఎమోషనల్‌గా కామెంట్లు పెడుతున్నారు.“మీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ సార్, సింపుల్‌గా ఉన్నా మీరు చాలా హుందాతనంగా ఉంటారు సార్, మీకున్న నిజాయితీ, విలువలకు ఎవరైనా ఫ్యాన్స్ అయిపోవాల్సిందే” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.దాతృత్వం లోనూ రతన్ టాటా తనకుతానే సాటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.కరోనా సమయంలో ఆయన రూ.1500 కోట్లు దేశానికి విరాళమిచ్చిన విషయం తెలిసిందే.ఇంకా ఆయన లెక్కలేనన్ని విరాళాలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube