టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక మందన ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అని సంబంధం లేకుండా అన్ని భాషల్లో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది.
ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది.దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె నితిన్( Nitin ) సినిమా నుంచి తప్పుకుంటుంది అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో రష్మిక బిజీగా ఉంది.దీనితోపాటు హిందీలో యనిమల్ ద్విభాషా చిత్రం రెయిన్ బో సినిమా( Rainbow movie ) లో నటిస్తూ బిజీగా ఉంది.నితిన్-వెంకీ కుడుముల మూవీలో ఈమెనే హీరోయిన్ గా చేస్తోంది.
కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఈమె తప్పుకొందనే వార్త జోరుగా వినిపిస్తోంది.
మరి ఈ వార్తలపై రష్మిక మందన ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.అయితే ఈ సినిమా నుంచి ఈ రష్మిక తప్పుకోవడంతో ఆమె స్థానంలో హీరోయిన్ శ్రీలీలను ఓకే చేసినట్లు తెలుస్తోంది.కదా రష్మిక వలే పుష్ప2 సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తోంది.