త్రివిక్రమ్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన రష్మిక! అంతా ఎన్టీఆర్ మాయ

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటి రష్మిక మందన.

వరుస హిట్స్ మీద హిట్స్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వచ్చేసి దర్శకుల ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ చైర్ సొంతం చేసుకున్న పూజాహెగ్డే స్థానంలోకి రావాలని చూస్తున్న రష్మిక వరుసగా పెద్ద హీరోల సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మళ్ళీ నితిన్ తో ఒక సినిమాలో జత కడుతున్న ఈ బెంగుళూరు భామ అల్లు అర్జున్ కి జోడీగా సుకుమార్ సినిమాలో నటిస్తుంది.

నితిన్ కి జోడీగా భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో రష్మిక క్రేజ్ మారిపోయింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోతున్సిన సినిమాలో ఎలా అయిన హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకోవాలని భావిస్తున్న రష్మిక ఈ సినిమా కోసం నిర్మాత, దర్శకుడుకి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడుకి సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

ఇక రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా ఇందులో తనని హీరోయిన్ గా అవకాశం ఇస్తే చాలని చెబుతున్నట్లు వినిపిస్తుంది.త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ సినిమా కోసం అయితే మళ్ళీ పూజా హెగ్డేని రిపీట్ చేసే యోచనలో ఉన్నాడని బోగట్టా.

ఆమె కాదంటే అప్పుడు నెక్స్ట్ ఛాయస్ గా రష్మికని అనుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు