గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.
అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.
ఇప్పుడు ఈమె అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.ఈమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో మిలియన్ ల కొద్దీ అభిమానులు ఉన్నారు.పెంపుడు జంతువులతో పలు వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ వెకేషన్ పిక్స్ షేర్ చేస్తూ.
ఇలా ప్రతి పనిలో ఈమె దాని గురించి చెబుతూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అలాగే ఈమె డైలీ వర్కౌట్ తో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటుంది.అయితే ఈమె అంత ఫిట్ గా ఉండడానికి గల ఏమై ఉంటుందా.ఏం తింటుందా అని చాలా మంది ఫ్యాన్స్ ఆలోచిస్తూ ఉంటారు.
అయితే తాజాగా రష్మిక ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.తన ఒక్కరోజు డైట్ ను రివీల్ చేసింది.
ఈ వీడియోలో రష్మిక షూటింగ్ సెట్స్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

షూట్ లో ఉన్నప్పుడు రష్మిక ముందు ఇస్డ్ కాఫీ, సెలెరీ జ్యుస్ తాగింది.ఆ తర్వాత లంచ్ లో బాదం వెన్నతో కూడిన ఓట్స్, సాయంత్రం టీ తాగింది.రాత్రి భోజనంలో చికెన్, మ్యాషుడ్ పొటాటోస్ ను తినింది.
ఇది ఈమె ఒక్కరోజు డైట్.ఇలా ఈమె ఫుడ్ తీసుకుంటూ స్లిమ్ గా అందంగా ఉంది.
ప్రెసెంట్ రష్మిక చేతిలో మిషన్ మజ్ను, గుడ్ బై, తో పాటు తెలుగులో పుష్ప 2, వంశీ పైడిపల్లి, విజయ్ సినిమా ఉన్నాయి.అలాగే దుల్కర్ సల్మాన్ సీతా రామం లో అతిథి పాత్రలో మెరుస్తుంది.







