ఇప్పుడు దొంగలు కూడా దొంగతనం చేయడంలో తమకంటూ ఓ స్టైల్ ఫాలో అవుతున్నారు.వారికంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకుంటున్నారు.
వింత వింత మాస్కులు పెట్టుకోవడం.వింత వింత విధాలుగా దొంగతనాలు చేయడం మనం నిత్యం పేపర్లలో, న్యూస్ ఛానెల్స్ లోనూ వింటూ ఉంటాం.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ దొంగ కూడా అంతే.తనకంటూ ఓ స్టైల్, స్ట్రేటజీ ఉంది.
ముఖంపై మాస్క్, తలపై టోపీ పెట్టుకుని అమాయకంగా కొత్త నెంబర్ ప్లేట్ ఉన్న బైక్ వేసుకుని దగ్గరకు వస్తాడు.వారితో మాట మాట కలిపి వారు తేరుకునేలోపే మోసం చేసి ఉడాయిస్తాడు.
హైదరాబాద్ లోని పాత బస్తీలో సంచరిస్తూ డబ్బులు దండుకుంటున్న ఈ దొంగ గురించి పలువురు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ దొంగ.
కిరాణా, మరియు అక్కడున్న బట్టల షాపుల్లో కొనుగోలు కోసం వచ్చినట్టు వచ్చి.వారితో మాట కలుపుతాడు.
పథకం ప్రకారం.సరుకులు, దుస్తులు ప్యాకింగ్ చేయిస్తాడు.
ఆ తర్వాత ఆన్ లైన్ పేమెంట్ అవ్వడం లేదని డబ్బులు ఇవ్వండి నేను ఇప్పుడే ఆన్ లైన్ పేమెంట్ చేస్తానంటూ చెప్పి వారిని నమ్మిస్తాడు.అలా వారి దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత.
పేమెంట్ కావడం లేదని.ఏటీఎం దగ్గర తీసి ఇస్తానని.
తోడుగా ఎవరినో ఒకరిని తనతో పంపించండి అంటూ అడుగుతాడు.అలా అతనికి తోడుగా వచ్చిన వారికి ఓ వంద రూపాయలు ఇచ్చి బేకరీ నుంచి ఫలానా వస్తువు తీసుకురమ్మంటూ మార్గమధ్యలోనే పంపిస్తాడు.
ఇంతలోనే ఈ దొంగ పారిపోతాడు.ఇలా నగరంలోని పలు ఏరియాల్లో.
ఈ దొంగ లక్షలాది రూపాయలు దోచుకుని వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో షాపుల యజమానులు అలర్ట్ అయ్యారు.
ఇలాంటి దొంగ మీ దగ్గరకు కూడా రావొచ్చు.జాగ్రత్తగా ఉండాలంటూ మోసపోయిన వ్యాపారస్తులు.
ఇతర వ్యాపార వస్తువులను అలర్ట్ చేస్తున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వ్యాపార వర్గాల్లో, నెట్టింట హల్‌చల్‌గా మారింది.







