టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే.రష్మిక మందన నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
పుష్ప సినిమాతో రష్మిక మందన క్రేజ్ మరింత పెరిగింది.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన కూడా ఒకరు.
తెలుగు తో పాటు హిందీలో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది రష్మిక.గత కొద్దిరోజులుగా రష్మిక మందన ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

దీంతో చాలామంది దర్శకనిర్మాతలు రష్మిక మందనకు అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్టు భయపడుతున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ప్రకారం రష్మిక మందనాను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తే కచ్చితంగా విషయంలో బాగా డల్ అవుతుందని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంది తాజాగా అందిన సమాచారం ప్రకారం రష్మిక మంద నాకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రాగా రెమ్యూనరేషన్ విషయంతో ఆమె ఆ సినిమా రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు రష్మిక అభిమానులు మండిపడుతున్నారు.

బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నావు రష్మిక అంటూ అభిమానులు ఆమెను తిట్టిపోస్తున్నారు.కాగా జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే.ఇందులో మొదటి హీరోయిన్గా రష్మిక మందనను ఫిక్స్ కాగా రష్మిక మాత్రం ఆ ప్రాజెక్టుకి 7 కోట్లు డిమాండ్ చేయడంతో నిర్మాతలు కాస్త ఆలోచించగా ఆ పారితోషికం విషయంలోనే ఆమె రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.అంత పారితోషికం మరీ టూ మచ్ అంటున్నారు మూవీ మేకర్స్.
ఎన్టీఆర్ సినిమాలో అవకాశం రావడం గొప్ప అనుకుంటే మళ్ళీ డబ్బు కారణంగా అవకాశాన్ని మిస్ చేసుకున్నావు అంటూ ఆమెపై మండి పడుతున్నారు.







