టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.
తాజాగా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి పండుగ జనవరి 12న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్,సాంగ్స్,పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించిన విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.కాగా తాజా వాళ్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోంది.
అదేమిటంటే.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఆల్రెడీ మరో సినిమాలో ఉన్నది కావడం విశేషం.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ లో నటించిన కమెడియన్ పృథ్వి, ఆ సినిమాలో పాత్ర పేరు సింగం సుజాత.అయితే ఆ సినిమాలోని ఒక సన్నివేశంలో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు సింగం సుజాత ఒక డైలాగ్ చెబుతాడు.రికార్డ్స్ లో నా పేరు ఉండడమేంట్రా.నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి సుజాత సింగం సుజాత అంటూ పవర్ ఫుల్ డైలాగ్ వేశారు పృథ్వి.

ఈ డైలాగ్ సినిమా ట్రైలర్లు చెప్పడంతో మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.విన్నర్ సినిమాలో డైలాగ్ అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలోని డైలాగును పక్కపక్కన పెట్టి ఇంత గుడ్డిగా డైలాగ్ కాపీ కొట్టేశారు ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే రెండు సినిమాలు ఒకే డైలాగ్ ఉన్న సంగతి ఎవరూ గుర్తించకపోవడం ఏంటో అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరి ఇ వార్తలపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.







