గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో రష్మిక.. భారీ బడ్జెట్ తో మూవీ ప్లాన్!

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.

 Rashmika Mandanna On Ga2 Pictures Banner Details, Rashmika Mandanna, Ga2 Picture-TeluguStop.com

అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.

ఇప్పుడు ఈమె అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.తాజాగా ఆమెకు మరొక ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.మన టాలీవుడ్ లో స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ లో గీతా ఆర్ట్స్ ఒకటి.ఈ బ్యానర్ పై తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ సినిమాలు కూడా నిర్మిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు అల్లు అరవింద్.

ఇక ఈ సంస్థకు అనుబంధంగా గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించారు నిర్మాత బన్నీ వాసు.

ఈ బ్యానర్ పై ఇప్పటి వరకు 100% లవ్, భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.

Telugu Pages, Ga, Geetha, Rashmika, Pakka, Bunny Vasu, Pushpa, Rashmika Latest-M

ఇక ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ సినిమాలతో పాటుగా చిన్న చిత్రాలు, మీడియం రేంజ్ సినిమాలు కూడా నిర్మిస్తున్నారు.ప్రెసెంట్ ఈ బ్యానర్ లో నాలుగు సినిమాలు నిర్మించ బడుతున్నాయి.

మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ నిర్మిస్తున్నారు.గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా ఈ సినిమా తెరకెక్కుతుండగా యువీ క్రియేషన్స్ తో కలిసి బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అలానే అల్లు శిరీష్ నటిస్తున్న ప్రేమ కాదంట సినిమా కూడా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఇపప్టికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

Telugu Pages, Ga, Geetha, Rashmika, Pakka, Bunny Vasu, Pushpa, Rashmika Latest-M

దీంతో పాటు నిఖిల్ 18 పేజెస్, కిరన్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కూడా ఈ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నాయి.ఇక తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో బన్నీ వాసు ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాకు ఈమె కూడా ఓకే చెప్పినట్టు టాక్.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube