గీతాంజలి క్యారెక్టర్ పై ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక మందన్న?

సినీనటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె రణబీర్ కపూర్ (Ranbir Kapoor)నటించిన యానిమల్ సినిమా (Animal) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 Rashmika Mandanna Emotional Comments About Geetanjali Character Details, Rashmik-TeluguStop.com

ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక ఈ సినిమాలో గీతాంజలి (Geetanjali) పాత్రలో నటించారు.ఈ పాత్ర గురించి తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

గీతాంజలి పాత్రను మాటల్లో చెప్పలేనని ఈమె తెలియజేశారు.

గీతాంజలి పాత్ర గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఆమె కుటుంబాన్ని కలిపి పవర్ ఉన్నటువంటి పాత్ర అని తెలిపారు.ఆమె ఎంతో ప్యూర్, రియల్, అన్‌ఫిల్టర్డ్, స్ట్రాంగ్ అండ్ రా.గీతాంజలి అనే పాత్ర ప్రేమను, ప్రశాంతతను పంచుతుంది.నమ్మకాన్ని కలిగిస్తుంది.భర్త, పిల్లల కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తుంటుంది.ఫ్యామిలీ కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడుతుంది.నా వరకు గీతాంజలి పాత్ర ఎంతో గొప్పది అంటూ ఈ సందర్భంగా ఈమె గీతాంజలి పాత్ర గురించి చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారం అవుతున్నప్పటికీ ఇంకా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా ఈమె తెలియజేశారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood ) పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయని తెలుస్తుంది.ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా( Pushpa 2 ) పనులతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అని సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు మరికొన్ని సినిమాలకు కూడా ఈమె కమిట్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube