హైదరాబాద్ ఫిలింనగర్ లో దంపతుల దారుణ హత్య ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఈ హత్యలు జరిగాయి.
అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఫిలింనగర్ లోని( Film Nagar ) సత్యాకాలనీ పయోనీర్ ఎన్ క్లేవ్ లో సయ్యద్ అహ్మద్ ఖాద్రీ(42),( Sayyed Ahmed Khadri ) సయీదా మిరాజ్ ఫాతిమా(40)( Saeda Miraj Fathima ) అనే దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి 2014లో వివాహం అయ్యింది.
సయ్యద్ అహ్మద్ ఖాద్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.అయితే మేకల వ్యాపారం కోసమని నదీం కాలనీలో ఉంటున్న అన్వర్( Anwar ) నుంచి రూ.20 లక్షల రూపాయలను రెండేళ్ల క్రితం ఖాద్రీ అప్పుగా తీసుకున్నాడు.అయితే అప్పు చెల్లించమని అన్వర్ ఎన్నిసార్లు అడిగినా ఖాద్రి మాత్రం సరిగ్గా స్పందించేవాడు కాదు.
తమకు వేరే వద్ద డబ్బులు రావాల్సి ఉందని, అవి రాగానే ఇస్తామని సర్ది చెబుతూ పంపించేవారు.

నవంబర్ 28న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సయ్యద్ అహ్మద్ ఖాద్రి తిరిగి ఇంటికి రాలేదు.29వ తేదీ రాత్రి ఫాతిమాకు హుమయున్ నగర్ లో నివాసం ఉంటున్న ఆమె అక్క మునీర్ ఫాతిమా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు.ఖాద్రీ కి ఫోన్ చేసినా అతను కూడా లిఫ్ట్ చేయలేదు.
దీంతో ఏం జరిగిందో అని అనుమానంతో వచ్చి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది.అయితే ఇంట్లో నుంచి గ్యాస్ వాసన బయటకు వస్తుండడంతో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే మిరాజ్ ఫాతిమా రక్తపు మడుగులో విగతజీవిల పడి ఉంది.
మృతురాలి అక్క మునీర్ ఫాతిమా నవంబర్ 30వ తేదీ ఈ ఘటనపై ఫిలింనగర్ పోలీసులకు( Film Nagar Police ) ఫిర్యాదు చేసింది.

అయితే పిల్లలు పుట్టకపోవడంతో తన చెల్లెలిని హత్య చేసి ఆమె భర్త ఖాద్రీ పారిపోయి ఉంటాడని పోలీసులకు మునీర్ ఫాతిమా( Muneer Fathima ) చెప్పింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఖాద్రీ ఇంటికి ముగ్గురు వ్యక్తులు రావడం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది.ఆ ముగ్గురిలో ఫాతిమా భర్తకు అప్పు ఇచ్చిన అన్వర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.గత నెల 28వ తేదీ రాత్రి నదీమ్ చెరువు వద్దకు ఖాద్రీని పిలిపించి స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేశాడు అన్వర్.
ఆ తర్వాత చెరువు వద్దనే గొయ్యి తీసి పాతిపెట్టాడు.ఆ తర్వాత ఖాద్రీ ఇంటికి వచ్చి అతని భార్య ఫాతిమాను కూడా చంపేశాడు.








