బాలీవుడ్ నటుడితో రష్మిక మందన్నా స్టెప్పులు.. వైరల్ వీడియో!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన.

పుష్ప సినిమాతో మరింత పాపులారిటిని సంపాదించుకుంది.ఇక పుష్ప సినిమాలో ఆమె వేసిన స్టెప్పులు ఆమె నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇక ఇది ఇలా ఉండే తాజాగా రష్మిక మందన పుష్ప సినిమాలోని పాటకు బాలీవుడ్ లోని ఒక టీవీ షోలో తనదైన స్టెప్పులతో అదరగొట్టింది.ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినా గోవిందతో కలిసి పుష్ప సినిమాలోని రారా స్వామి బంగారు స్వామి అనే పాటకు స్టేజ్ పై స్టెప్పులను వేసింది.

హిందీలో ప్రసారమవుతున్న సూపర్ మామ్స్‌ 3 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ ప్రోమోలో రష్మిక తన స్టెప్పులతో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.15 సెకండ్ల పాటు ఉన్న ఆ వీడియోలో రష్మిక మందన నటుడు గోవిందతో కలిసి స్టెప్పులను ఇరగదీసింది.

Advertisement

ఇది ఇలా ఉంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకునే రష్మిక మందన కోలీవుడ్ తో పాటు బాలీవుడ్,టాలీవుడ్లలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న రష్మిక మందన ఖాతాలో మరికొన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక తెలుగులో రష్మీక సరిలేరు నీకెవ్వరు, గీత గోవిందం, భీష్మ, పుష్ప, సీతారామం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇదే రష్మిక నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

తాజా వార్తలు