స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం నుండి నేడు రిలీజ్ అయిన తొలి లిరికల్ సాంగ్ ‘దాక్కొ దాక్కొ మేక’ యూట్యూబ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలోని ఈ మాస్ సాంగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇక ఈ పాటలో పూనకం తెచ్చుకుని మరీ బన్నీ చేసిన పర్ఫార్మెన్స్‌కు ఆయన అభిమానులు ఊగిపోతున్నారు.దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కూడా ఈ పాటనను మరో లెవెల్‌కు తీసుకెళ్లడంతో ఈ పాట సోషల్ మీడియాలో దున్నేస్తోంది.
అయితే పుష్పలోని ఈ ‘దాక్కొ దాక్కొ మేక’ పాటపై చిత్ర హీరోయిన్ రష్మిక మందన కొన్ని హాట్ కామెంట్స్ చేసింది.ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని ఆమె అంటోంది.
అయితే ఓ పెద్ద ఐస్ బర్గ్ నుండి కేవలం ఓ ముక్కను మాత్రమే ప్రేక్షకులకు చూపించడం కరెక్ట్ కాదని ఆమె అంటోంది.అంటే ఆమె ఉద్దేశ్యంలో ఈ సినిమా ఓ పెద్ద ఐస్ బర్గ్ అని, అందులో నుండి కేవలం తొలి లిరికల్ సాంగ్‌ను ఓ చిన్న ముక్కగా చూపించారని ఆమె అంటోంది.
ఇది అర్ధం చేసుకోలేక కొంతమంది రష్మిక కామెంట్స్‌పై ఫైర్ అవుతున్నారు.
ఏదేమైనా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప ఫస్ట్ లిరికల్ సాంగ్ ఏకంగా ఐదు భాషల్లోనూ దుమ్ములేపుతోంది.
పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కాబోతున్న ‘పుష్ప-ది రైజ్’ తొలి భాగం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెత్‌తో తెరకెక్కించగా ఈ సినిమాలో సునీల్, ఫాహద్ ఫజిల్ లాంటి నటులు విలన్ పాత్రల్లో నటిస్తున్నారు.
మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.