గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.
అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.
ఇప్పుడు ఈమె అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.ప్రెసెంట్ రష్మిక చేతిలో మిషన్ మజ్ను, గుడ్ బై, తో పాటు తెలుగులో పుష్ప 2, వంశీ పైడిపల్లి, విజయ్ సినిమా ఉన్నాయి.
అలాగే దుల్కర్ సల్మాన్ సీతా రామం లో అతిథి పాత్రలో మెరుస్తుంది.ఈమె బాలీవుడ్ లో ఇన్ని సినిమాలు చేస్తున్న ఇంకా అనుకోని అవకాశాలు ఈ అమ్మడిని వరిస్తూనే ఉన్నాయి.
ఎంత అదృష్టం ఈమెది అని అంతా అనుకుంటున్నారు.బాలీవుడ్ లో ఇన్ని అవకాశాలు ఉండగానే మరొక అవకాశం ఈమెను వరించింది.
ప్రెసెంట్ ముంబైకే మకాం మార్చగా ఈమెను బాలీవుడ్ మేకర్స్ ఓ రేంజ్ లో అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన అవకాశం కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.

సల్మాన్ ‘నో ఎంట్రీ’ సినిమా సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు.ఈ సినిమాలో ఏకంగా సల్మాన్ ఖాన్ 10మంది నాయికలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఆ పది మంది హీరోయిన్ లలో రశ్మికను ఓకే చేసినట్టు టాక్ అక్కడి మీడియాలో బలంగా వినిపిస్తుంది.ఈమె మాత్రమే కాదు సౌత్ అగ్ర కథానాయికలను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రష్మికతో పాటుగా సమంత, పూజా, తమన్నా వంటి హీరోయిన్ ల పేర్లు కూడా నొర్ ఎంట్రీ కోసం వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు ఇక్కడ కూడా క్రేజ్ తేవడం కోసం ఇలా ప్లాన్ చేస్తున్నారని టాక్.
మరి రష్మిక కాకుండా ఇంకెంత మంది సౌత్ హీరోయిన్ లకు అవకాశం ఇస్తారో చూడాలి.








