టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక మందన ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
తెలుగు తమిళం, హిందీ భాషల్లో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే రష్మిక మందన నటించిన వారిసు, మిషన్ మజ్ను సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అయితే వారీసు సినిమా తమిళ సినిమా కాగా మిషన్ మజ్ను బాలీవుడ్ సినిమా అన్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాలు విడుదల సందర్భంగా తాజాగా ఒక మీడియాతో ముచ్చటించిన రష్మిక మందన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే తన స్నేహితురాలు సమంత గురించి స్పందించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.సమంత ఒక అద్భుతమైన మహిళ.ఎంతో దయ కలిగిన అందమైన వ్యక్తి.
నేను తనని ఒక అమ్మలాగా ఎప్పుడు తనని సంరక్షించాలని అనుకుంటున్నాను.మయోసైటీస్ గురించి ఆమె ప్రకటించిన తర్వాతనే నాకు కూడా తెలిసింది.
అంతవరకు తనకు మయోసైటిస్ ఉందని నాకు కూడా తెలియదు అని తెలిపింది రష్మిక మందన.ఎందుకంటే అంతకు ముందు సమంత ఎప్పుడూ ఆ విషయం గురించి స్పందించిన మాట్లాడిన సందర్భాలు లేవు.

జీవితంలో ఎన్నో సవాళ్లతో పోరాటం నిలబడిన వ్యక్తిని ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే స్ఫూర్తిగా భావిస్తారో అదే విధంగా నేను కూడా ఆమె నుంచి ప్రేరణ పొందుతాను.సమంతకు అన్ని విధాలుగా మంచే జరగాలని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది రష్మిక మందన.ఇకపోతే రష్మిక మందన సినిమాల విషయానికొస్తే.తమిళంలో విజయ్ దళపతి తో కలిసి నటించిన వారీసు సినిమా తెలుగులో వారసుడు టైటిల్ తో విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.అలాగే బాలీవుడ్లో సిద్ధార్థ మల్హోత్ర తో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటించింది.ఈ సినిమా జనవరి 19న విడుదల కానుంది.







