టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప.ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఆ సమయం రానే వచ్చేసింది.
నేడు ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలను పుష్ప రాజ్ చేరుకోగలిగాడు.
అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఇలా ఉండడంతో ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా అయోమయంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇటీవలే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రష్మిక మందన ఓవరాక్షన్ చేసింది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.అందుకు రష్మిక మందన కూడా తనదైన శైలిలో స్పందించింది.
తాజాగా మరొకసారి కన్నడ మీడియా రాష్ట్రానికి చెందిన తన పాత్రకు డబ్బింగ్ మాతృభాషలో చెప్పలేదని ఒక అంశాన్ని లేవనెత్తింది.

ఇదే విషయంపై అల్లుఅర్జున్ క్లారిటీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రష్మిక మందన పై ట్రోలింగ్స్ ఆగడంలేదు.రష్మిక మందన చిత్తూరు భాష యాసను నేర్చుకోవడానికి చాలా కష్టపడింది.మరి ఈ సినిమాను కన్నడలో డబ్ చేయడానికి కొంత సమయం తీసుకోకపోతే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు? ఇంకొందరు రష్మీక ఒకేసారి అనేక ప్రాజెక్టులలో పని చేస్తోంది పైగా ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా అలాంటి పనులు చేయరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి, అన్నిటికంటే మించి రష్మిక ఇప్పటికే పలుసార్లు క్షమాపణలు చెప్పింది, అంతే కాకుండా పుష్ప సినిమా రెండవ భాగానికి డబ్బింగ్ మిస్ చేయనని హామీ కూడా ఇచ్చినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఆమెపై ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి, కామెంట్లు వస్తూనే ఉన్నాయి.