Vijay Deverakonda Rashmika Mandanna : మై డార్లింగ్.. పార్టీ ఇవ్వాలి అంటున్న రష్మిక.. క్యూట్ రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇలా ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల నుంచి మొదలుకొని తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇక రష్మిక విజయ్ దేవరకొండతో( Vijay Deverakonda ) రిలేషన్ లో ఉన్నారని అయితే వీరి విషయాన్ని బయటకు చెప్పడం లేదు అంటూ తరచూ వీరిద్దరే రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.ఇక రష్మిక కూడా తరచూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వెకేషన్( Vacations ) లకు వెళ్లడం వారి ఇంట్లోనే పండగలను సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే త్వరలోనే ఈమె దేవరకొండ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ ( Family Star ) సినిమాని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ ట్రైలర్( Family Star Trailer ) వీడియోని రష్మిక తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.

Advertisement

మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురాం గారికి బెస్ట్ విషెస్ అని తెలిపారు.ఫ్యామిలీ స్టార్ సినిమా చూడటం కోసం తాను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది తనుకు పార్టీ ఇవ్వాలి అంటూ ఈమె చెప్పకు వచ్చారు.

ఇలా పార్టీ కావాలి అంటూ రష్మిక అడగడంతో ఈ పోస్టును రీ పోస్ట్ చేస్తూ విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ అంటూ కామెంట్ చేశారు ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు