బుల్లితెర యాంకర్ రష్మీకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ప్రస్తుతం ఈటీవీలోని మెజారిటీ రియాలిటీ షోలకు రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
కొన్నిరోజుల క్రితం వరకు ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు మాత్రమే హోస్ట్ గా వ్యవహరించిన రష్మీ ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు హోస్ట్ గా ఎంపికయ్యారు.ప్రస్తుతం జబర్దస్త్ షోకు కూడా రష్మీనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో రామ్ ప్రసాద్, పరదేశి, రష్మీ ఆదిపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.పూర్ణ హైపర్ ఆది ఫ్లర్టింగ్ ఆది అని ఆది సాయికుమార్ క్వైట్ ఆది అని చెప్పుకొచ్చారు.
హైపర్ ఆది సరే హనీమూన్ బాగా జరిగిందా పూర్ణ అని చెబుతూ ఆమె పరువు తీసేశారు.ఆ తర్వాత పాయల్ నరేష్ ను చూసి సో క్యూట్ అని చెప్పగా నరేష వన్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అని చెబుతాడు.
ఆ తర్వాత రష్మీ కొన్ని ఫోటోస్ ను తీసుకొస్తామని ఫోటోస్ లో ఉన్నవాళ్లు మీకు నచ్చకపోతే ఫోటోలను తగలబెట్టవచ్చని రష్మీ సూచనలు చేశారు.రామ్ ప్రసాద్ ఆది గురించి చెబుతూ ఆది వల్ల ఒక విషయంలో వ్యక్తిగతంగా హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత రామ్ ప్రసాద్ ఆది ఫోటోను తగలబెట్టారు.పరదేశి మాట్లాడుతూ ఆది అన్న అంటే అన్నీ ఆయనే అని చెబుతానని చెప్పుకొచ్చారు.

ఒక రీజన్ వల్ల నేను ఈ విధంగా చేయాల్సి వస్తోందని పరదేశి తెలిపారు.పరదేశి తన ఫోటోను ముక్కలు చేసే ప్రయత్నం చేయడంతో ఆది సైతం షాకయ్యారు.ఆ తర్వాత రష్మీ ఆది ఫోటోను చించివేసి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ లో ఆదిగారు నన్ను హేయ్.రష్మీ ఎప్పుడొచ్చావ్ అని అడగలేదని ఎప్పుడు వెళ్తున్నావ్ అని అడిగారని రష్మీ చెప్పుకొచ్చారు.
మీరెవరిని కాల్చుతారని రష్మీ ఆదిని అడగగా ఆది ఎవరి ఫోటోను కాల్చారో ప్రోమోలో చూపించలేదు.







