తొలిసారి తండ్రి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టిన రష్మీ గౌతమ్.. వైరల్ వీడియో!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మి గౌతమ్.

 Rashmi Gautam On Her Father In Sridevi Drama Company, Rashmi Gautham , Emotional-TeluguStop.com

ఇకపోతే రష్మీ కి యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.ఇక మామూలుగా రష్మి గౌతమ్ తన పర్సనల్ విషయాలను ఎంతో గొప్యంగా ఉంచుకుంటుంది.

ఎప్పుడూ ఎలాంటి సందర్బాలలో కూడా తన వ్యక్తిగత విషయాల గురించి బయటపెట్టలేదు.అంతేకాకుండా తన పర్సనల్ విషయాల పై కూడా ఎఫ్పుడూ స్పందించ లేదు.

ఈ క్రమంలోనే చాలామంది రష్మి పర్సనల్ లైఫ్ గురించి గురించి తెలుసుకోవడానికి ఎన్నో రూమర్స్ ని సృష్టిస్తుంటారు.

ఇకపోతే ఇటీవల రష్మీకి పెళ్లి అయ్యిందని ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే రష్మీ పేరెంట్స్ విషయంలో కూడా అలానే జరిగిందని అంటుంటారు.రష్మీ తల్లి సింగిల్ పేరంట్ అని తెలిసిందే.రష్మీని తన తల్లే పెంచి, పోషించింది.రష్మికి తండ్రి లేడు.

తండ్రి చనిపోయాడో లేదంటే వీరికి దూరంగా ఉంటున్నాడో అన్న విషయం తెలియదు.ప్రస్తుతం రష్మీ వైజాగ్‌లో ఉంటుంది.

ఇక రష్మీ గౌతమ్ ఒడిశాకు చెందిన అమ్మాయి అన్న సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మీ ఎమోషనల్ అయ్యింది.

ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది.ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ షోను ప్లాన్ చేసి కమెడియన్ల తండ్రులను తీసుకురాగా ఇందులో భాగంగా పవిత్ర, రష్మీ, వర్ష వంటి వారు ఎమోషనల్ అయ్యారు.అప్పుడు రష్మీ కూడా ఎమోషనల్ అవుతూ తన తండ్రి గురించి పరోక్షంగా స్పందించింది.తన తండ్రి గురించి చెప్పడం ఇష్టం లేక, చెడుగా చెప్పలేక అలా వదిలేసినట్టు కనిపిస్తోంది.

పేరెంట్స్‌లో చెడ్డ పేరెంట్స్ ఉంటారో లేదో నాకు తెలియదు.అయినా సరే హ్యాపీ ఫాదర్స్ డే అంటూ రష్మీ స్టేజ్ మీదే ఎమోషనల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube