నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో రసాభాస

నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో రసాభాస నెలకొంది.వైసీపీ కార్పొరేటర్లు సభను జరగనివ్వడం లేదని మేయర్ ఆరోపిస్తున్నారు.

మేయర్ బడ్జెట్ చదువుతున్న సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.అయితే వైసీపీ కార్పొరేటర్లు సభను అడ్డుకుంటున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

అయితే కార్పొరేటర్లు సమస్యలతో పాటు పట్టణ ప్రణాళిక విభాగం అక్రమాలపై వైసీపీ కార్పొరేటర్లు చర్చ కొనసాగించగా.మరికొంత మంది సభ్యులు సర్వసభ్య సమావేశం తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో బడ్జెట్ పూర్తి చేసిన తరువాత ప్రకటిస్తామని మేయర్ చెప్పినా కార్పొరేటర్లు వినిపించుకోలేదని ఆమె ఆరోపించారు.

Advertisement
ఆ విషయంలో మహేష్ ను గౌతమ్ బీట్ చేస్తాడు.. అశోక్ గల్లా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు