కురుమద్దాలి లక్ష్మి నరసింహ రావు అలియాస్ సుత్తి వేలు ( Sutthi velu )తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో అనేక చిత్రాలలో నటించిన హాస్య నటుడు( Comedy actor ).సుమారు 32 సంవత్సరాల పాటు వెండితెర పై తన అద్భుతమైన నటనతో నవ్వులు పండించిన ఘనత ఆయన సొంతం.
ఆయన నటించిన మొదటి చిత్రం ముద్దమందారం ( Mudda Mandaram )(1981), నుంచి ఆఖరి చిత్రం రామాచారి (2013), వరకు అనేక చిత్రాలలో, అనేక వేషాలతో మెరిసి ప్రేక్షకులను అలరించారు సుత్తి వేలు.సినీ పరిశ్రమలో హాస్య బ్రహ్మగా పిలవబడే మహనీయ దర్శకుడు జంధ్యాల గారి అన్ని చిత్రాలలో సుత్తి వేలు తన హాస్యం తో నువ్వులు పూయించారు.
కేవలం హాస్యాస్పదమైన పాత్రలే కాకుండా, హృదయాన్ని హత్తుకునే కారుణ్య రసం తో కూడిన విభిన్న పాత్రలలో కూడా నటించారు సుత్తి వేలు.
32 ఏళ్ళ సినీ ప్రయాణంలో సుత్తి వేలు అనేక పురస్కారాలు అందుకున్నారు.తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత పురస్కారం నంది అవార్డు.సుత్తివేలు తన కెరీర్లో నాలుగు నంది అవార్డులు అందుకున్నారు.
ఇందులో మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, సుత్తి వేలు గారు 1985 వ సంవత్సరంలో రెండు విభాగాలలో నంది అవార్డు( Nandi Award ) అందుకున్నారు.ఇది అయన ఖాతాలో ఉన్న ఒక అరుదయిన రికార్డు.1985 లో విడుదలైన “వందేమాతరం”( Vandemataram ) చిత్రానికి గాను ఆయనకు “ఉత్తమ సహాయనటుడు” విభాగంలో అవార్డు లభించింది.అదే ఏడాది విడుదలైన మరో చిత్రం “దేవాలయం”.
ఈ చిత్రానికి గాను ఆయనకు “ఉత్తమ హాస్యనటుడు” విభాగంలో మరో అవార్డు దక్కింది.ఈ రెండు చిత్రాలలో ఒక విశేషముందండి.అదేమిటంటే….ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది ఒక్కరే.
ఆయనే టీ.కృష్ణ గారు.అంతే కాదండి…ఈ రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి.ఆ తరువాత సుత్తి వేలు కు 1989 లో “గీతాంజలి” చిత్రానికి బెస్ట్ మేల్ కమెడియన్ విభాగంలో ఒక నంది అవార్డు, 1990 లో విడుదలైన “మాస్టారు కాపురం” చిత్రానికి గాను అదే విభాగంలో మరొక నంది అవార్డు అందుకున్నారు.