Rare Medical Condition: కడుపులో బిడ్డ ఉండగానే మళ్లీ గర్భం దాల్చింది.. ఎలా అంటే?

వారిది ఆదర్శవంతమైన ప్రేమ వివాహం.మొదట వారికి పండంటి బిడ్డ జన్మించాడు.తర్వాత మరో బిడ్డ కోసం ప్రయత్నించారు.కానీ విధి వాళ్లను వెక్కిరించింది.గర్భస్రావం కావడంతో ఆ బిడ్డ.కన్నుమూసింది.

 Rare Medical Condition: కడుపులో బిడ్డ ఉండగాన-TeluguStop.com

కొంతకాలం తర్వాత మరలా ఆమె గర్భం దాల్చింది.అయితే మళ్లీ గర్భస్రావం జరిగింది.

దానితరువాత మూడోసారి కూడా అలాగే జరిగింది.మూడు సార్లు కావడంతో ఆమె చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది.

దాంతో మరోసారి గర్భం దాల్చాలంటేనే ఆమెకు వణుకు పుట్టింది.అలాంటి పరిస్థితులలో ఆమె మరలా గర్భం దాల్చింది.

ఐతే ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైయ్యింది.గర్భంలో శిశువు ఉండగానే మరలా ఆమె గర్భం దాల్చింది.

డాక్టర్లు చెప్పిన విషయం తెలుసుకొని ఆమె, ఆమె భర్త విస్తుపోయారు.వివరాల్లోకి వెళ్తే, US టెక్సాస్‌కు చెందిన 30 ఏళ్ల కారా విన్‌హోల్డ్ కి 2018లో తొలి సంతానం కలిగింది.

ఆ తర్వాత వరుసగా 3సార్లు ఆమెకు గర్భస్రావం అయింది.3వ సారి గర్భస్రావం కావడంతో చనిపోయినంత పనైంది ఆమెకి.దాంతో మళ్లీ గర్భం దాల్చాలంటేనే ఆమెకి భయమేసింది.దాని తరువాత ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి నెల తప్పింది.నెల రోజుల తర్వాత మరోసారి తీసిన స్కానింగ్‌లో రెండో పిండం కూడా వైద్యులకు కనిపించింది.విషయం తెలుసుకున్న కారా షాకైపోయింది.“మొదటి సారి స్కానింగ్‌లో రెండో బిడ్డ లేడు కదా?” అని డాక్టర్లను ప్రశ్నించింది.దానికి వారు బదులుగా… “మొదట 2 అండాలు విడుదల అయ్యి ఉంటాయి.

అయితే ఆ రెండూ ఒకేసారి ఫలదీకరణం చెందకుండా, ఇంచుమించుగా ఓ వారం తేడాతో ఆ రెండు అండాలు పిండాలుగా మారాయి.అయితే ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతున్నారు.భయపడవద్దు.” అని వైద్యులు చెప్పగా ఆమె సంతోషించింది.కాగా తాజాగా ఆమెకు డెలివరీ కూడా జరిగింది.ఆరు నిమిషాల తేడాతో పుట్టిన కవలలు ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు.వాళ్లను చూసిన కారా దంపతులు సంతోషంలో మునిగిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube