సినిమానే జీవితం కాదు.. ఒక పార్ట్ మాత్రమే.. యామీ గౌతమ్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ నటి యామి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.యామి గౌతమ్ సినిమాల ద్వారా కంటే యాడ్స్ ద్వారా ప్రేక్షకులకు బాగా పాపులర్ అయ్యింది.

 Yami Gautam Comments About Carrier And Personal Life , Yami Gautham, Bollywood,-TeluguStop.com

మొదట నువ్విలా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన యామి గౌతమ్ ఆ తర్వాత గౌరవం, యుద్ధం లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

విక్కీ డౌనార్, సనమ్ రే, కాబిల్, ఉరి ఇలా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఇది ఇలా తాజాగా యామి గౌతమ్ సోషల్ మీడియాలో చిట్ చాట్ లో భాగంగా మాట్లాడుతూ.

తాను సినిమాను జీవితం అన్నంతగా చూడనని, సినిమా అన్నది జీవితంలో ఒక పార్ట్ గా మాత్రమే చూస్తాను అని తెలిపింది.అలాగే సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యులతో సరైన సమయాన్ని గడుపుతూ,ఇష్టమైనది కూడా తింటూ,ఉండాలి అనుకున్న విధంగా ఉంటాను అని చెప్పుకొచ్చింది యామీగౌతమ్.

వృత్తి జీవితాన్ని అలాగే పర్సనల్ జీవితాన్ని ఎప్పుడూ కూడా వేర్వేరుగా చూడాలని అలా చేసినప్పుడు మాత్రమే జీవితంలో సంతోషం ఉంటుందని అలా కాకుండా జీవితంలో సినిమా తప్ప మరేమీ లేదు అనుకుంటే కచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చింది యామి గౌతమ్.

Telugu Bollywood, Carrier, Personal, Yami Gautham-Movie

అప్పుడు జీవితంలో సినిమా తప్ప మరేమీ కనిపించవు, అంతా శూన్యం అన్నట్టుగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది యామి గౌతమ్.అలాగే హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేయాలని కోరిక ఏమీ లేదని అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ వ్యక్తిగతంగా జీవితంలో సంతోషంగా ఉండాలి అనేదే తన కోరిక అన్నట్టుగా యామి గౌతమ్ చెప్పుకొచ్చింది.ఇకపోతే యామి గౌతమ్ బాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే.

వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను కూడా కమిట్ అయి సినిమాల సంఖ్య పెంచుకోకుండా అరకొర సినిమాలు చేస్తూ తన వ్యక్తిగత విషయాన్ని సాఫీగా ముందుకు తీసుకువస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube