మైనర్ బాలికపై అత్యాచారం.. సాయం కోరిన కనికరించని సమాజం..!

భారతదేశంలో ఎన్ని చట్టాలు వచ్చిన.ఎంత కఠినంగా శిక్షించిన మహిళలకు రక్షణ అనేది కరువైందనే చెప్పాలి.

 Rape Of A Minor Girl A Merciless Society That Sought Help , Madhya Pradesh , So-TeluguStop.com

ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు.సమాజంలో ఉండే కామాంధులు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు.తాజాగా మధ్యప్రదేశ్( Madhya Pradesh ) లో జరిగిన ఒక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.12 ఏళ్ల మైనర్ బాలికపై కొందరు గుర్తుతెలియని కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.అత్యాచార బాధితురాలు ఒంటిపై గాయాలతో, ప్రతి ఇంటికి వెళ్లి సాయం కోసం ఎంతలా అర్తించిన ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలలో రికార్డ్ అయింది.

అర్ధ నగ్నంగా, రక్త స్రావంతో బాలిక బాధపడుతూ సాయం కోసం కనిపించిన వారందరినీ అర్తించింది.ఈ దారుణ ఘటన ఉజ్జాయిని సమీపంలోని బాద్ నగర్ రహదారిపై చోటుచేసుకుంది.

Telugu Indore, Madhya Pradesh, Uttar Pradesh-Latest News - Telugu

ఈ వీడియో సోషల్ మీడియా( Social media ) వేదికగా వైరల్ అయింది.ఆ వీడియోలో బాలిక తన ఒంటిపై ఒక గుడ్డ చుట్టుకుని వీధుల్లో తిరుగుతూ రోడ్డుపై సాయం కోసం తిరుగుతుంటే.స్థానికులు ఆమెను చూస్తూ ఉన్నారే తప్ప సాయం చేసేందుకు ముందుకు రాలేదు.ఒక వ్యక్తిని సహాయం కోసం అడుగగా అతను ఆ బాలికను నెట్టేయడం కూడా వీడియోలో స్పష్టంగా రికార్డు అయింది.

చివరికి ఆ బాలిక సహాయం కోసం వీధుల్లో తిరుగుతూ ఓ ఆశ్రమానికి చేరుకుంది.

Telugu Indore, Madhya Pradesh, Uttar Pradesh-Latest News - Telugu

అక్కడ ఉండే పూజారి ఆ బాలికను టవల్ తో కప్పి జిల్లా ఆసుపత్రికి తరలించగా.బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.బాలిక ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్ తరలించారు.

వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు.

ఆ బాలిక మాటలు చూస్తుంటే ఆమె ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కి చెందినట్లు తెలుస్తుంది.మిగతా వివరాలు విచారణ ద్వారానే వెలుగులోకి వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube