సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా రంగస్థలం ఇప్పుడు తమిళ్ లో డబ్బింగ్ అయ్యి రిలీజ్ కి రెడీ అయ్యింది.రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
రంగస్థలం టైటిల్ తోనే తమిళ్ లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.కోలీవుడ్ లో ఫేమ్ ఉన్న సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు రంగస్థలంలో ఉండటం, అలాగే కంటెంట్ నేటివిటీ కూడా తమిళ్ కి దగ్గరగా ఉండటంతో అక్కడి ప్రేక్షకులకి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని భావించి డబ్బింగ్ చేశారు.
ఇక రంగస్థలం తమిళ్ వెర్షన్ ని ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు అక్కడి నిర్మాతలు రంగం సిద్ధం చేశారు.ఇప్పటికే సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా చేసేస్తున్నారు.
అయితే తమిళనాడులో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.
అయినా కూడా ప్రేక్షకులు సినిమాలు చూడటానికి కరోనాని లెక్క చేయకుండా థియేటర్స్ కి వస్తూ ఉన్నారు.
దీంతో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.మరోవైపు హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత అక్కడ ఎక్కువగా ఉంది.
ఈ నేపధ్యంలో ఏప్రిల్ 26 నుంచి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో రిలీజ్ కి రెడీ అయిన రంగస్థలం మూవీని తప్పనిసరి పరిస్థితిలో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.కేవలం రంగస్థలం మాత్రమే కాకుండా ఇప్పటికే రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న స్టార్ హీరో ధనుష్ మూవీ కర్ణన్ ప్రదర్శనలు కూడా ఆగిపోనున్నాయి.
ఈ నేపధ్యంలో మళ్ళీ లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఆ సినిమా రీ-రిలీజ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.మరో వైపు రిలీజ్ కి రెడీ అయిన మిగిలిన తమిళ్ సినిమాలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.