రంగస్థలం మూవీ రివ్యూ

డైరెక్టర్ – సుకుమార్

 Rangastalam Movie Review-TeluguStop.com

నిర్మాత – మొహన్ చెరుకూరి ,నవీన్ ఎమినేని, రవి శంకర్

నటీనటులు – రామ్ చరణ్,సమంతా ,ఆది పినిశెట్టి జగపతి బాబు.

సంగీతం – దేవీశ్రీ ప్రసాద్

స్క్రీన్ ప్లే – సుకుమార్

నిర్మాణ సంస్థ – మైత్రి మోవీ మేకర్స్

రిలీజ్ డేట్ – 30 మార్చ్ – 2018

నిడివి – 3 hr

మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

మరియు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చినటువంటి రంగస్థలం సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మీద ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే అందరినీ అలరించిందని టాక్ అయితే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులని అలరించిందా.రామ్ చరణ్ ఒక వైవిధ్యమైన పాత్రని పోషించాడు ఆ పాత్రకి న్యాయం చేయగలిగాడా లేదా అనేది చూద్దాం

కథ :

రంగస్థలం నేది ఒక ఊరు ఆ ఊరిలో ఎవరికీ ఏ అవసరం వచ్చినా సరే చిటికెలో చేసిపెట్టే వాడు చిట్టి బాబు (రామ్ చరణ్ ) చెవిటి వాడే అయినా అవతల వాళ్లు పెదాల కదలికను బట్టి మ్యాటర్ అర్ధం చేసుకుంటాడు…ఊళ్ళో ఆనందం ఎలా ఉంటుంది దాని వేనుకాలో కుట్రలు కుతంత్రాలు కూడా అలానే ఉంటాయి.ఊరు రాజకీయాలను శాసించాలని నిర్ణయించుకున్న కుమార్ బాబు (ఆది)కి చిట్టి బాబు సపోర్ట్ గా నిలుస్తాడు.ప్రెసిడెంట్ గా ఉన్న జగపతిబాబును గద్దె దించే ప్రయత్నం చేస్తారు…ఈ సమయంలోనే చిట్టిబాబుకి కుమార్ బాబుకి గొడవలు అవుతాయి.

ఇంతకీ కుమార్ బాబు గెలుస్తాడా ? లేక చిట్టి బాబు గెలుస్తాడా .? అతను గెలిచాక అతను ఏం చేశాడు.? చిట్టి బాబుకి కుమార్ బాబు మధ్య గొడవలు అసలు ఎందుకు వచ్చాయి అనేది సినిమా కధ.

నటీనటుల ప్రతిభ :

సినిమా మొత్తంలో రామ్ చరణ్ ఓ అద్భుతం అనే చెప్పాలి.సినిమా మొత్తాన్ని ఒక్కడుగా నడిపించాడు.ముఖ్యంగా ముఖ్యంగా స్టార్ హీరో గా ఉన్న చరణ్ ఎంతో చాలెంజింగ్ రోల్ చేశాడు.చేయడం ఒక్కటే కాదు తన నటనతో అందరినీ మెప్పించాడు కూడా.డైరెక్టర్ సుకుమార్ చరణ్ లో సరి కొత్త నటుడిని పరిచయం చేశాడు.

అంతేకాదు క్లైమాక్స్ లో చరణ్ నటనకు అందరు ఫిదా అవ్వక తప్పదు.కుమార్ బాబుగా ఆది మరోసారి మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.

ప్రకాశ్ రాజ్, జగపతిబాబులు తమ వర్సటైల్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశారు.ఇక యాంకర్ అనసూయ రంగమ్మత్తగా మరో మారు దుమ్ము దులిపేసిందనే చెప్పాలి.

సాంకేతికవర్గం

1985 కాలం నాటి సినిమా అంటే ఆ సమయానికి తగ్గట్టుగా సెట్స్ వేయాలి.అలాంటి రూపు లేఖలు అద్దాలి అయితే ఈ విషయంలో నాటి సెట్స్ వేసిన ఆర్ట్ డైరక్టర్ గొప్పతనం గురించి పొగడాల్సిందే…ప్రతీ సన్నివేశంలో ఒక సుందర రూపం కనిపిస్తుంది.

ప్రేక్షకులని మెప్పిస్తుంది.ఇక దేవి విషయానికి వస్తే ప్రత్యేకించి చెప్పేది ఏముంది ఈ సినిమాని మ్యూజిక్ పరంగా ఓ రేంజ్ కి తీసుకుని వెళ్ళాడు.

పాటలన్ని ప్రేక్షకాదరణ పొందినవే.పిక్చరైజేషన్ కూడా బాగుంది.

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా సినిమాకు ప్రాణం పోశాడు కచ్చితంగా రత్నవేలు కెరియర్ లో ఈ సినిమా మంచి పేరు తెస్తుంది చెప్పచ్చు.సినిమా రన్ టైం ఎక్కువ ఉన్నా సరే ప్రేక్షకులని కుర్చీల నుంచీ కదల కుండా చేసింది.

విశ్లేషణ :

సుకుమార్ రంగస్థలం సినిమా మొదలు పెట్టిన సమయం నుంచీ అది క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది.రామ్ చరణ్ గెటప్ .నుంచీ అనసూయ ఎలా ఉండబోతోంది.సమంత ఓణీ లుక్కింగ్ అంతా సినిమా పై అంచనాలని పెంచేసింది.1985నాటి కథ.స్వచ్చమైన మన్షుల మధ్య ఓ స్వార్ధం కలిగిన వ్యక్తి మంచిగా నటిస్తూ ఎలా ప్రజలను మోసం చేయాలని చూశాడు.దానికి మన సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగింది.ముఖ్యంగా చరణ్ నటన సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది.చరణ్ ను ఇలా సుకుమార్ ఎలా ఊహించుకున్నాడో కాని దానికి మాత్రం 100 పర్సెంట్ న్యాయం చేశాడు.ఇక సినిమాలో డ్రామా ఎక్కువగా నడుస్తుందని చెప్పొచ్చు…మొదటి భాగం అంతా స్పీడ్ గా లాగించేసినా సెకండ్ హాఫ్ కొంచం స్లో అయ్యింది అనుకునే సమయానికి ఎదో ఒక మ్యాజిక్ చేసేవాడు సుకుమార్.

ఎలక్షన్స్ సీన్స్ కాస్త ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

చరణ్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

సుకుమార్ టేకింగ్

మైనస్ పాయింట్స్ :

రన్ టైం

సెంటిమెంట్

బాటం లైన్ :రంగస్థలం.సగటు వ్యక్తి దర్పణం

రేటింగ్ : 3.25/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube