వెయ్యి కిలోమీటర్ల హైవే

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి జార్ఖండ్‌లోని రాంచీ వరకు నిర్మిస్తున్న పన్నెండు వందల కిలోమీటర్ల హైవే రెండువేల పదిహేడో సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుంది.

ఈ హైవే ఓడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల గుండా పోతుంది.

ఈ హైవే కారణంగా ఆర్థికాభివృద్ధి జరగడమే కాకుండా మావోయిస్టు కార్యకలాపాలు కూడా అరికట్టవచ్చని భావిస్తున్నారు.ఈ హైవేలో ఇప్పటికే ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది.

మిగిలిన నూటతొంభైతొమ్మిది కిలోమీటర్ల పని వేగంగా జరుగుతోంది.దేశంలోని పొడవైన హైవేలలో ఇదొకటి.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.కొత్తగా నిర్మించబోయే రాజధాని నగరం అమరావతి పక్కనే విజయవాడ ఉండటం ప్లస్‌ పాయింట్‌ అయింది.

Advertisement

ఉమ్మడి రాష్ర్టంలోనూ హైదరాబాద్‌ తరువాత విజయవాడను చెప్పుకునేవారు.ఒకప్పుడు విజయవాడ సినిమా పంపిణీ కంపెనీలకు, పత్రికలకు, ప్రచురణ కేంద్రాలకు హబ్‌గా ఉండేది.

ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ.ఉమ్మడి రాష్ర్ట రాజకీయాలను ప్రభావితం చేసిన ఈ నగరం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది.

రాజధాని నిర్మాణం పూర్తయిన తరువాత ఇది మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!

Advertisement

తాజా వార్తలు