Urfi Javed : ఉర్ఫీ జావేద్ వస్త్రధారణపై అలాంటి కామెంట్స్ చేసిన రణ్ బీర్ కపూర్?

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటి ఉర్ఫి జావెద్( Urfi Javed ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉర్ఫి జావెద్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె డ్రెస్సింగ్ స్టైల్.

 Ranbir Kapoor Comments On Urfi Javed Fashion-TeluguStop.com

చిత్ర విచిత్రమైన వస్త్రధారణ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఆమె ధరించే బట్టలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆమె డ్రస్సు వేసుకుందా అన్న అనుమానం కూడా రాక మారదు.

ఉర్ఫి జావెద్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆలోచిస్తూ కేవలం తన ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కవర్ చేసుకునే విధంగా డ్రస్సులు ధరిస్తూ ఉంటుంది.

వస్త్రధారణ విషయంలో సోషల్ మీడియాలో తరచూ నిలవడంతో పాటు ఎన్నో రకాల విమర్శలను నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఎవరు ఎన్ని విధాలుగా నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఉర్ఫీ జావెద్ ఫ్యాషన్ పై రణ్ బీర్( Ranbir Kapoor ) కామెంట్లు చేశాడు.

ఆమె ఫ్యాషన్ చెడు గా ఉందని నటుడు రణ్ బీర్ అన్నారు.కరీనా కపూర్‌( Kareena Kapoor )తో జరిగిన చాట్ షోలో ఆయన దీనిపై స్పందింస్తూ.అలాంటి ఫ్యాషన్‌ పై తనకు ఆసక్తి లేదని తెలిపారు రణ్ బీర్.కానీ మనం ఎక్కడ సుఖంగా ఉన్నామో అలాంటి ప్రపంచంలోనే మనం హ్యాపీగా జీవింగలం అని చెప్పుకొచ్చాడు.

ఇది మంచి టేస్టా లేదా బ్యాడ్ టేస్ట్ అని కరీనా మరోసారి ప్రశ్నించగా, అది బ్యాడ్ టేస్ట్ అని సమాధానం ఇచ్చాడు రణ్ బీర్.ఇకపోతే రణ్ బీర్ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే.

గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.కాగా హీరో రణబీర్ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

వీరికి ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube