Ranasthali Movie Review: రణస్థలి రివ్యూ: యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయిన కథ!

డైరెక్టర్ పరుశురామ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రణస్థలి. ఇక ఈ సినిమాలో ధర్మ, అమ్ము అభిరామి, చాందిని కీలక పాత్రలో నటించారు.

 Madhava Dharma Ammu Abhirami Parasuram Srinivas Ranasthali Movie Review And Rati-TeluguStop.com

అంతేకాకుండా ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను సురెడ్డి విష్ణు సమర్పణలో ఏజే ప్రొడక్షన్స్ పతాకంపై అనుపమ సురెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ధర్మ బసవపాత్రలో, చాందిని అమ్ములు పాత్రలో కనిపిస్తారు.

అయితే వీరిద్దరూ బావ మరదలు.అమ్ములు తన తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోవడంతో బసవ ఇంట్లోనే పెరుగుతుంది.

అయితే ధర్మ తండ్రి మున్నియ్య (సమ్మెట గాంధీ) విరికి పెళ్లి చేస్తాడు.

ఇక బసవకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆరు నెలల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది.

దీంతో ఖాళీగా ఉండకుండా అప్పు తీర్చడం కోసం ఏదైనా ఒక పని చేయాలి అనుకోని చక్రవర్తి (బెనర్జీ) అని పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి పని చేస్తాడు.అయితే చక్రవర్తి తోటలో నలుగురు పనివాళ్ళు పనిచేయడానికి రావడంతో వాళ్లకి బస ఏర్పాటు చేయమని చక్రవర్తి బసవ దంపతులకు చెబుతాడు.

Telugu Ammu Abhirami, Ashok Sanga, Madhava Dharma, Prashanth, Ranasthali, Shiva

అయితే వాళ్లు పని చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు మర్డర్లు చేసే బ్యాచ్.అయితే ఈ విషయం బసవకు తెలిసేలోపే అప్పటికి చక్రవర్తిని, తన భార్య అమ్ముల్ని చంపేస్తారు.ఇక బసవకు సుదర్శన్ (ప్రశాంత్ పాండు), ఈశ్వరి (అమ్ము అభిరామి) దంపతులు శత్రువులవుతారు.అయితే ఆ వచ్చిన వాళ్ళు వాళ్లని ఎందుకు చంపారు.సుదర్శన్ దంపతులకు బసవకు ఎందుకు పడదు అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

నటీనటుల నటన విషయానికి వస్తే ధర్మ తన పాత్రతో బాగా నటించాడు.ఇక చాందిని కూడా అమ్ములు పాత్రలో అద్భుతంగా నటించింది.ఇక మిగతా నటీనటులు ఇంతవరకు తమ పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.

Telugu Ammu Abhirami, Ashok Sanga, Madhava Dharma, Prashanth, Ranasthali, Shiva

టెక్నికల్:

డైరెక్టర్ పరుశురాం మంచి కథను ప్రేక్షకుల ముందుకు పరిచయం చేశాడు.కేశవ కిరణ్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు.మిగతా టెక్నికల్ విభాగాలు బాగానే పనిచేశాయి.

విశ్లేషణ:

ఇక ఈ సినిమాను డైరెక్టర్ ఎక్కడ బోర్ కొట్టకుండా అద్భుతంగా చూపించాడు.యాక్షన్స్ సన్నివేశాలలో మాత్రం ప్రేక్షకులను ఫిదా చేశాడు అని చెప్పవచ్చు.

ట్విస్టులను కూడా బాగా ఆకట్టుకునేలా చేశాడు.

Telugu Ammu Abhirami, Ashok Sanga, Madhava Dharma, Prashanth, Ranasthali, Shiva

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, కథ, యాక్షన్ సన్నివేశాలు, సంగీతం.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కాస్త ఎడిటింగ్ లో జాగ్రత్త పడితే బాగుండేది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

రేటింగ్: 3/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube