'యానిమల్‌' మొదటి రోజు కలెక్షన్స్ పై చర్చోప చర్చలు

రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా( Animal movie ) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు మొదటి నుంచి కూడా పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ చేయడం లో చిత్ర యూనిట్‌ సభ్యులు సఫలం అయ్యారు.

 Ranabeer Kapoor Animal Movie Collections , Ranabeer Kapoor, Animal Movie, Sande-TeluguStop.com

తప్పకుండా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ఉంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతూ వచ్చారు.రెండేళ్ల ఎదురు చూపుల నేపథ్యంలో సినిమా విడుదల అయింది.

సినిమా సౌత్ లో వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని, మొత్తం మీద ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను టచ్‌ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ చాలా మంది తమ అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తూ వచ్చారు.ముఖ్యంగా మొదటి రోజు వసూళ్ల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొదటి రోజు ప్రపంచం మొత్తం కలిపి దాదాపుగా 50 నుంచి 65 కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశౄలు ఉందని అంటున్నారు.బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల్లో కూడా సినిమా విడుదల అవుతున్న విషయం తెల్సిందే.

అందుకే సినిమా కు ఆ రేంజ్ లో వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయి.చాలా చోట్ల పెయిడ్‌ ప్రీమియర్ షో లు వేయడం జరిగింది.కనుక సినిమా కు వసూళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ ఎత్తున సాధించబోతున్న వసూళ్లకు మొదటి రోజు వసూళ్లు అత్యంత కీలకం.

అందుకే ఫస్ట్‌ డే వసూళ్లు ఏంత అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.

ఈ సినిమా తో రష్మిక కి మొదటి కమర్షియల్‌ హిట్ బాలీవుడ్‌ లో దక్కబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube