ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అన్ని రంగాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో రానా సౌత్ బే పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు.ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలకు సొంతంగా యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి.
సాధారణంగా సెలబ్రిటీలు తమ సినిమా, వ్యక్తిగత విశేషాలను యూట్యూబ్ ద్వారా వెల్లడించే ప్రయత్నం చేస్తారు.కానీ రానా మాత్రం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త టాలెంట్ ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్న రానా యూట్యూబ్ ఛానల్ ద్వారా నిర్మాతగా మారనున్నాడని తెలుస్తోంది.తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల కంటెంట్ ఈ యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేయనున్నారని సమాచారం.
లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్, ఓటీటీలపై ఆధారపడుతున్నారు.
ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పది సెకన్ల నిడివి నుంచి కొన్ని గంటల నిడివి ఉన్న కథల వీడియోలను అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది.
ప్రతిభ ఉండి సరైన ప్రోత్సాహం లేని వారిని ఈ ఛానల్ ద్వారా రానా వెలుగులోకి తీసుకురానున్నారని.ఈ ఛానల్ లో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం వెలుగులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది.
రానా ప్రస్తుతం అరణ్య సినిమాలో నటిస్తున్నారు.
మరోవైపు మలయాళం సినిమా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫామ్ కాగా మరో ముఖ్య పాత్రలో రానా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.
ఆ పాత్ర గురించి రానా స్పందిస్తూ ఆ పాత్ర తనకు ఆఫర్ చేసిన మాట నిజమేనని ఇంకా ఫైనలైజ్ కాలేదని తెలిపారు.ఈ సినిమాలో నటించాలని తనకు కూడా ఆసక్తిగా ఉందని తెలిపారు.