టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుసబెట్టి చాలా కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.అంతేగాక, ఇప్పటికే పలు సినిమాలను రిలీజ్‌కు లైన్‌లో పెట్టిన ఈ హల్క్, అటు టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫ్లాంల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు.
ప్రస్తుతం ఎక్కడచూసినా వెబసిరీస్‌ల హవా నడుస్తుండంతో, రానా కూడా వాటివైపు చూస్తున్నాడు.ఈ క్రమంలో రానా ఓ ముఖ్య పాత్రలో నటించేందుకు ఓ వెబ్‌సిరీస్‌ను రెడీ చేస్తున్నారు సదరు దర్శకనిర్మాతలు.
అయితే ఈ వెబ్ సిరీస్‌లో మరో విశిష్టత కూడా ఉండటంత విశేషం.ఈ సినిమాలో రానా దగ్గుబాటితో పాటు ‘నారప్ప’తో అదిరిపోయే హిట్ అందుకున్న స్టార్ యాకర్ట్ విక్టరీ వెంకటేష్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ వెబ్ సిరీస్‌లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ మరో రేంజ్‌లో ఉండబోతున్నట్లు మేకర్స్ అంటున్నారు.వీరిద్దరిని మరోసారి ఒకే స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ వెబ్ సిరీస్ కోసం రానా దగ్గుబాటి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.ఇది వెంకటేష్ కంటే కూడా ఎక్కువగా ఉండబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ స్థాయిలో రానా ఓ వెబ్ సిరీస్ కోసం రెమ్యునరేషన్ పుచ్చుకోవడం నిజంగా విశేషమని అంటున్నారు అభిమానులు.
ఇక సినిమాల పరంగా రానా దగ్గుబాటి ఇప్పటికే ‘విరాటపర్వం’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేయగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియమ్’లో కూడా నటిస్తున్నాడు.
ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న రానా, ఆయన చేయబోయే వెబ్ సిరీస్ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఏదేమైనా రానా ఓ వెబ్ సిరీస్ కోసం ఇంతమొత్తంగా రెమ్యునరేషన్ పుచ్చుకోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.







