పాపం... రానా స్విచ్‌ వేస్తే ఆ హీట్‌ త్రిషకు తగిలింది

కాఫీ విత్‌ కరణ్‌ షోకు వెళ్లాలంటే లోగుట్టును అంతా బయట పెట్టే దమ్ము ఉండాలి.ఎందుకంటే ఈ షోలో భాగంగా కరణ్‌ జోహార్‌ వ్యక్తిగత విషయాల గురించి గుచ్చిగుచ్చి అడుగుతాడు.

 Rana Daggubati Koffee With Karan Show Effect On Trisha-TeluguStop.com

ఇకపోతే ఎఫెయిర్ల విషయం అయితే వాటిని అసలు వదిలి పెట్టడు.తాజాగా ఈ షోకు ‘బాహుబలి’ టీం ప్రభాస్‌, రానా, రాజమౌళిలు హాజరయ్యారు.

ఈ షోలో భాగంగా రానా త్రిషతో తనకు గ రిలేషన్‌ షిప్‌ను బయట పెట్టాడు.ఇదివరకు ఎప్పుడు అడిగినా కూడా ఇద్దరు కేవలం మేము స్నేహితులమే అనే సమాధానాలు ఇస్తూ దాటేసేవారు.

తాజాగా రానా అలా కాకుండా త్రిషతో ఓ రెండు నెలలు డేటింగ్‌ చేశానని, ఆ తర్వాత మా రిలేషన్‌ ముందుకు వెళ్లలేదని క్లారటీ ఇచ్చేశాడు.రానా ఇలా చెప్పాడు ఒకే గాని ప్రస్తుతం ఈ హీట్‌ ముద్దుగుమ్మ త్రిషకు తగిలింది.రెండు నెలలు డేటింగ్‌ చేసి ఎలా రిజక్ట్‌ చేశారు, అసలు ఏమయింది, ఇద్దరి మద్య రిలేషన్‌షిప్‌ ఎంతవరకు వచ్చింది అని త్రిషకు స్నేహితులు, మీడియా, అభిమానులు ఒకటే కాల్స్‌ చేస్తున్నారట.

ఇన్ని రోజులు ఈ విషయం గురించి ఎందుకు బయటపెట్టలేదు అంటూ సన్నిహితులు ఫోన్‌లు చేస్తు త్రిషను ఆడుకుంటున్నారట.దాంతో ఇక చేసేది లేక త్రిష ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి పక్కన పడేసినట్టు సమాచారం అందుతోంది.ఏది ఏమైనా వారి రిలేషన్‌ షిప్‌ గురించి రానా స్విచ్‌ వేస్తే ఆ హీట్‌ త్రిషకు తగుతోంది పాపం.

కానీ ఇద్దరి మద్య బ్రేకప్‌ ఎందుకయ్యిందో తెలుసుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది.అందుకే ఈ అమ్మడికి వరుసపెట్టి కాల్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube