నరేష్ పవిత్రల నిజస్వరూపం బయటపెట్టానన్న రమ్య.. బిడ్డ ఏడుస్తోందంటూ?

గత కొన్నిరోజులుగా సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ రిలేష్ షిప్ లో ఉండటం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే.తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పవిత్ర లోకేశ్ పై చెప్పుతో దాడి చేయడం చర్చనీయాంశమైంది.

 Ramya Raghupati Shocking Comments About Senior Naresh And Pavitra Lokesh Details Here , Ramya Raghupati Shocking Comments, Pavitra Lokesh , Ramya Raghupati , Senior Naresh , Shocking Facts-TeluguStop.com

అయితే రమ్య రఘుపతి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మైసూరులోని ఒక హోటల్ లో పవిత్ర, నరేష్ ఉన్నారని తనకు రాత్రి సమాచారం అందిందని ఆమె తెలిపారు.

రాత్రి సమయంలో రచ్చ చేయడం ఇష్టం లేక సైలెంట్ అయ్యానని ఉదయం మీడియాతో పాటు హోటల్ కు వెళ్లానని ఆమె తెలిపారు.ఒకే గదిలో వాళ్లిద్దరూ ఉండి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని తనకు ఈ విధంగా సాక్ష్యాలు లభించాయని ఆమె తెలిపారు.

 Ramya Raghupati Shocking Comments About Senior Naresh And Pavitra Lokesh Details Here , Ramya Raghupati Shocking Comments, Pavitra Lokesh , Ramya Raghupati , Senior Naresh , Shocking Facts-నరేష్ పవిత్రల నిజస్వరూపం బయటపెట్టానన్న రమ్య.. బిడ్డ ఏడుస్తోందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీ కుటుంబంలోని ఆడపిల్లకు ఈ విధంగా అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా అని ఆమె ప్రశ్నించడం గమనార్హం.

నరేష్, పవిత్రల నిజస్వరూపం బయటపెట్టానని ఆమె పేర్కొన్నారు.

నరేష్ లో తప్పు చేశాననే భావన కొంచెం కూడా కనిపించలేదని రమ్య పేర్కొన్నారు.నా క్యారెక్టర్ ను నరేష్ నాశనం చేశాడని నా గురించి అసత్య ప్రచారాలు చేశాడని ఆమె తెలిపారు.

విడాకులు ఇస్తే నాపై పడిన మచ్చ పోతుందా? అని ఆమె ప్రశ్నించారు.విడాకులు తీసుకోకుండా తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆమె అన్నారు.

తన గురించి తప్పుగా జరుగుతున్న ప్రచారం వల్ల బిడ్డ బాధ పడుతోందని రమ్య రఘుపతి తెలిపారు.

పవిత్ర లోకేశ్ వల్లే నరేష్ తన గురించి తప్పుగా మాట్లాడటంతో రమ్య ఆమెపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించిందని తెలుస్తోంది.రమ్య రఘుపతి చేస్తున్న కామెంట్ల వల్ల అటు నరేష్ ఇటు పవిత్ర లోకేశ్ పరువు పోతుంది.చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని రమ్య రఘుపతి నరేష్ లకు నెటిజన్లు సూచిస్తున్నారు.

సీనియర్ నరేష్ ప్రస్తుతం పలు సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube