Ramya Krishna :రంగమార్తాండ సినిమాపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్.. ఈ మూవీని చూస్తారా అంటూ?

టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ( Krishnavamsi ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగమార్తాండ.ఈ సినిమా నేడు అనగా మార్చి 22 ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే.

 Ramya Krishna Shocking Comments About Krishna Vamsi Rangamarthanda Movie-TeluguStop.com

చాలా కాలం తర్వాత కృష్ణవంశీ రూపొందించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమాను విడుదలకు ముందే సినీ ప్రముఖులకు ప్రీమియర్స్ వేసి సినిమా చూపించగా వాళ్లు సినిమా అద్భుతంగా ఉందని.

ఎమోషన్స్ చాలా బాగున్నాయని, గుండె బరువెక్కింది అంటూ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.సినిమా చూసిన తర్వాత కన్నీళ్లు ఆపుకోవడం కష్టం అని వారు అంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్( Prakash Raj ) బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇక ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తమ పాత్రల్లో ఒదిగిపోయారని నటనతో కట్టిపడేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే సినిమా విడుదలలు ముందు నటి రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సినిమా మొదలవ్వక ముందు.

ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని తన భర్త, దర్శకుడు కృష్ణవంశీని అడిగానని రమ్యకృష్ణ తెలిపారు.రంగమార్తాండ సినిమా నటసామ్రాట్ కు రీమేక్ అన్న విషయం తెలిసిందే.

అయితే నట సామ్రాట్ సినిమాను నేను చూశాను.

ఇలాంటి సినిమాను తీస్తే ఎవరు చూస్తారు అని నేను కృష్ణవంశీకి అడిగాను.ఆయన మాత్రం తన మాట వినకుండా సినిమాను మొదలు పెట్టేశారు.అలాగే ఈ సినిమా హీరోయిన్ కోసం చాలా మందిని సంప్రదించారు.

ఎవ్వరూ సెలక్ట్ కాకపోవడంతో నేను ఆ పాత్ర చేశాను అని తెలిపారు రమ్యకృష్ణ( Ramya krishna ) నేను ఎమోషనల్ సినిమాలు చూడను.కానీ ఈ సినిమాలో నేను కళ్లతోనే నటించాలని కృష్ణవంశీ చెప్పారని రమ్యకృష్ణ అన్నారు.

మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube