నేను రెడీ ! మీరు రెడీనా ..? సవాల్ విసురుతున్న రమణదీక్షితులు

టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు మళ్ళీ మాటల తూటాలు వదిలాడు.కొద్దిరోజులుగా ఇతని ఆస్థులమీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సైలెంట్ అయిన దీక్షితులు ఇప్పుడు మళ్ళీ నోరువిప్పారు.

 Ramana Deekshitulu Demands Cbi Enquiry-TeluguStop.com

తనకు భారీగా ఆస్తిపాస్తులు ఉన్నాయని కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.ఇదంతా కుట్రలో భాగం అని ఆయన వ్యాఖ్యానించారు.

అవసరం అయితే నా ఆస్తులపై సీబీఐ విచారణకు నేను సిద్ధమని.శ్రీవారి నగల విషయంలో మీరు సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు.

జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజులు టీటీడీకి పట్టిన ఏలినాటి శనిలాంటి వారని రమణ దీక్షితులు విమర్శించారు.బాలసుబ్రమణ్యం హయాంలోనే వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేశారని, దీని వెనుక ఆయనకు లాభం ఉందన్నారు.బాలసుబ్రమణ్యం తనకు రోజుకు 50 రూపాయలు కూలీ అని ఏర్పాటు చేశారు.అది ఆ తరువాత నెలకు రూ.3 వేలు నుంచి రూ.7 వేలు అయ్యింది.రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు రూ.60 వేలు వేతనంగా ఇచ్చారు.అదికూడా కోర్టు నిర్ణయం ప్రకారమే నని తెలిపారు.

ప్రతాపరుద్రుడు స్వామి వారికి సమర్పించిన అమూల్యమైన సంపద…అన్నపోటు వద్ద నిధిగా ఉందని బ్రిటీష్‌వారి శాసనంలో ప్రస్తావించారని…అందుకే అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు ఆరోపించారు.

అక్రమాలను బయటపెట్టినందుకే తనను ముందుగానే రిటైర్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో కూడా తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని, వారసత్వంగా వచ్చిన ఇంటిని కక్షపూరితంగా కూల్చివేశారని రమణ దీక్షితులు ఆరోపించారు.

వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చవద్దని…దాన్ని కాపాడాలని, మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తప్పనిసరిగా కూల్చాల్సివస్తే మరోచోట నిర్మించాలని వినతిపత్రం కూడా ఇచ్చానన్నారు.దీంతో తనపై కక్ష్య కట్టి వంశ పారంపర్యంగా ఉన్న తన ఇంటిని కూల్చివేశారన్నారు.

తనపై రెండుసార్లు హత్యాప్రయత్నం కూడా జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతాపరుద్రుడు ఏడుకొండల స్వామి వారికి సమర్పించిన అమూల్యమైన సంపద అన్నపోటు వద్ద నిధిగా ఉందని బ్రిటీష్‌ శాసనంలో ప్రస్తావించారని రమణ దీక్షితులు గుర్తుచేశారు.

అందుకోసమే అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆరోపించారు.అక్రమాలను బయటపెట్టినందుకే తనను ముందుగానే రిటైర్‌ చేశారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube