గోపీచంద్ మూవీ టైటిల్ అనౌన్స్.. బాలయ్య సలహా పాటించారుగా..

మ్యాచో స్టార్ గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో గోపీచంద్ కూడా ఉన్నారు.

 Rama Banam Movie name for gopichand's Next in Sriwass Direction, Gopichand,-TeluguStop.com

ఈయన హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.ప్రెజెంట్ పలు సినిమాలు ఓకే చేసి బిజీగా ఉన్న ఈయన తాజాగా సంక్రాంతి పండుగ రోజు కొత్త సినిమా టైటిల్ ను రివీల్ చేసాడు.

గోపీచంద్ సీటిమార్ సినిమా హిట్ తర్వాత మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ చేసాడు.కానీ సీటిమార్ తో హిట్ అందుకున్న ఈయన పక్కా కమర్షియల్ తో యావరేజ్ సినిమా అనిపించు కున్నాడు.

ప్రెజెంట్ గోపీచంద్ లక్ష్యం, లౌక్యం వంటి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో మరో సినిమా చేస్తున్నాడు.ఈసారి కూడా మరో హిట్ ఇస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్నాడు.

ఇక ఈ సినిమా టైటిల్ నే ఈ రోజు పండుగ సందర్భంగా రివీల్ చేసారు.ఇటీవలే బాలయ్య అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా రాగా బాలయ్య గోపీచంద్ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్ సజెస్ట్ చేసాడు.ఇప్పుడు అదే టైటిల్ ను ఈ రోజు అనౌన్స్ చేసారు.బాలయ్య బాబు మాటకు గౌరవం ఇచ్చి నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ”రామబాణం” అనే టైటిల్ ను అధికారికంగా అనౌన్స్ చేసారు.

గోపీచంద్30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ”రామబాణం” అనే టైటిల్ ను ఖరారు చేసారు.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తుండగా జగపతిబాబు కూడా కీలక రోల్ లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube