ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఆడియెన్స్ ను మెప్పించాడు రామ్ పోతినేని.అంతకు ముందు వరకు రామ్ చాకోలెట్ బాయ్ లా యువతకు దగ్గరయ్యి ప్రేమ కథలను మాత్రమే ఎంచుకుని వాటిలో నటిస్తూ వచ్చాడు.
అయితే పూరీ జగన్నాథ్ ఈ లవర్ బాయ్ ను కాస్త మాస్ లుక్ లోకి మార్చి ప్రేక్షకులకు ఇష్మార్ట్ శంకర్ అంటూ కొత్తగా పరిచయం చేసాడు.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రామ్ ఫాలోయింగ్ కూడా పెరగడమే కాకుండా ఈయన మాస్ హీరోల లిష్టులోకి చేరిపోయాడు.
ఇక ఈ సినిమా తర్వాత రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్‘ సినిమా చేసాడు.కానీ ఈ సినిమా విజయం సాధించలేదు.ఈ సినిమా తర్వాత రామ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు.
దీంతో ఇప్పుడు బోయపాటి సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని ఆశ పడుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.

ఇది ఇలా ఉండగా రామ్ తాజా మేకోవర్ ఒకటి బయటకు వచ్చింది.ఈయన తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు.దీనికి సంబందించిన ఫోటో బయటకు రాగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఫొటోలో రామ్ గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో రగ్గడ్ లుక్ లో ఇస్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు.
దీంతో రామ్ ఈ మేకోవర్ బోయపాటి సినిమా కోసమే అని తెలుస్తుంది.

మరి ఇంత కష్టపడుతున్న రామ్ కు బోయపాటి అయినా భారీ విజయం ఇచ్చి పాన్ ఇండియా స్టార్ అని అనిపిస్తాడో లేదో చూడాలి.ఇక రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నారు.
మరి ఈ సినిమాతో బోయపాటి రామ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తాడో చూడాలి.







