సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఎంతో మంది అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా సినీ సెలెబ్రెటీలకు ఎంతో మంది అభిమానులు ఉండగా ఆ హీరో హీరోయిన్ల పట్ల అభిమానులు ఎప్పటికప్పుడు వారిపై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు ఇలా ఎంతో మంది హీరోల పేరిట సేవా కార్యక్రమాలు చేయగా మరికొందరు విగ్రహాలు ప్రతిష్టించి పూజిస్తూ ఉంటారు.
అలాగే చాలామంది సెలబ్రిటీల పేర్లను వారి పిల్లలకు కూడా పెట్టుకుంటూ ఉంటారు.అయితే తాజాగా రామ్( Ram )పోతినేని అభిమానులు తమకు కొడుకు పుట్టడంతో ఏకంగా తమ కొడుకుకి రామ్ నటిస్తున్నటువంటి సినిమా పేరు పెట్టారు.
హరిహర దంపతులకు రామ్ అంటే ఎంతో అభిమానం ఇలా ఈ హీరో పై ఉన్నటువంటి అభిమానంతో తాజాగా ఈ దంపతులకు కుమారుడు జన్మించడంతో ఏకంగా ఆ కుమారుడికి రామ్ హీరోగా నటించిన స్కంద( Skanda ) సినిమా పేరుని తన కుమారుడికి నామకరణం చేశారు.ఈ నామకరణ వేడుకకు రామ్ అభిమానులు హాజరుకావడమే కాకుండా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.హీరోలపై అభిమానంతో ఆ హీరోల పేర్లను తమ పిల్లలకు పెట్టుకోవడం చూసాము కానీ ఇలా సినిమా పేర్లు పెట్టుకోవడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా ఈ దంపతులు తమ కుమారుడికి స్కంద అనే పేరు పెట్టారు అంటే రామ్ అంటే వీరికి ఎంత అభిమానమో ఇక్కడే అర్థమవుతుంది.ఇక రామ్ బోయపాటి శీను( Boyapati Sreenu ) దర్శకత్వంలో నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల ( Sreeleela )నటించారు.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయన నటించిన సినిమాలన్నీ చేదు అనుభవాన్ని మిగిల్చాయి ఈ క్రమంలోని ఈ సినిమాపై రామ్ తోపాటు అభిమానులు కూడా ఎన్నో అంచనాలను పెంచుకున్నారు.