'స్కంద'గా రామ్.. టైటిల్ గ్లింప్స్ తో బోయపాటి విశ్వరూపం!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని( Ram potheneni ) ఒకరు.లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న రామ్ ఇప్పుడు మాత్రం తన లైనప్ ను వరుసగా యాక్షన్ సినిమాలతో ఫిల్ చేసుకుంటున్నాడు.

 Ram Pothineni Boyapati's Skanda Title Glimpse, Rapo20, Ram Pothineni, Boyapati S-TeluguStop.com

ఇష్మార్ట్ శంకర్( Ishmart Shankar ) సూపర్ హిట్ అవ్వడంతో అదే దారిలో నడుస్తున్నాడు.ప్రజెంట్ రామ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో అసలు సిసలైన యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మూవీ ఒకటి.

ఈయన దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.రామ్ హీరోగా మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల ( Srileela )హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”RAPO20”.

ఇప్పటికే షూట్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుండి ఫస్ట్ థండర్ అంటూ రిలీజ్ చేసిన వీడియో అందరిని ఎంతగానో అలరించింది.

ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.ఈ గ్లింప్స్ లో బోయపాటి( Boyapati ) తన డైరెక్షన్ లోని విశ్వరూపాన్ని చూపించాడు.భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు.

ఈ గ్లింప్స్ లో రామ్ డైలాగ్స్ తో పాటు లుక్ కూడా అదిరిపోయింది.అలాగే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ గ్లింప్స్ కు మరింత ఊపు తీసుకు వచ్చింది.

ఇక ముందు నుండి వైరల్ అవుతున్న ”స్కంద” #Skanda టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.ఈ గ్లింప్స్ #SkandaTitleGlimpse చూస్తుంటే సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్స్ బద్దలు అవ్వడం ఖాయం అని అనిపిస్తుంది.ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

https://youtu.be/Ra-aK6xCCvQ
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube