రామ్ అభిమానుల అసంతృప్తి.. ఆ హీరోలను ఫాలో అవ్వు బాబు

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది.జులై నెలలో విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా ప్రారంభం అవుతున్నాయి.

 Ram Not Doing Back To Back Movies Fans Un Happy ,hero Ram, Ram Movies, The Warri-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసినా కూడా రామ్‌ తదుపరి సినిమాను ఇంకా మొదలు పెట్టక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా రామ్‌ తదుపరి సినిమాల విషయంలో అస్సలు ప్లాన్‌ చేయడం లేదు అంటూ అభిమానులు అంటున్నారు.

ఎందుకంటే రామ్‌ యొక్క సినిమా లు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తున్నాడు.ఈమద్య కాలంలో ఏ ఒక్క హీరో కూడా అలా ప్లాన్‌ చేయడం లేదు.

ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు.చిరంజీవి పవన్‌ కళ్యాణ్ లు ఏ స్థాయి లో సినిమాలను చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నారు.

రవితేజ మరియు నానిలు కూడా సినిమాలతో స్పీడ్‌ మీద ఉన్నారు.

Telugu Ram, Nani, Ram Fans, Ram Pothineni, Ravitjea, Warrior, Tollywood Heros, T

ఇలాంటి సమయంలో రామ్‌ కూడా తన సినిమాల జోరును చూపిస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే రామ్‌ బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా కాకుండా ఒకే సారి రెండు మూడు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇతర హీరోల మాదిరిగా ఒకే సారి ఎక్కువ సినిమా లను చేసే పద్దతికి అలవాటు పడాలంటూ రామ్‌ కు విజ్ఞప్తి చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

సోషల్‌ మీడియాలో రామ్‌ సినిమాల ఎంపిక విషయంలో అభిమానులు ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ మరియు బోయపాటి కాంబో సినిమా ను వచ్చే ఆగస్టు లో లేదా సెప్టెంబర్ లో మొదలు పెట్టబోతున్నారట.

అంటే ది వారియర్ సినిమా పూర్తి అయిన తర్వాత విడుదల అయిన తర్వాత అప్పుడు బోయపాటి తో ఈ బాబు సినిమా పట్టాలు ఎక్కబోతుంది.మళ్లీ బోయపాటి సినిమా పూర్తి అయ్యాక కొత్త సినిమా.

ఇలా అయితే ఏడాదికి ఒక్క సినిమా కూడా రాదు అనేది అభిమానుల అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube