టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి రాజమౌళి.అతని సినిమా అంటే ఓ రకమైన పాజిటివ్ బజ్, హైప్ మొదటి నుంచి ఉంటుంది.
అలాగే ప్రస్తుతం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అతని సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.ఇండియన్ వైడ్ గా పాపులారిటీని బాహుబలి సినిమాతో రాజమౌళి సొంతం చేసుకున్నారు.
ఇద్డిలా ఉంటే అలాంటి దర్శకుడుతో పని చేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకోరు.లాంగ్ షెడ్యూల్ ఉన్నా కూడా మిగిలిన సినిమాలు పక్కన పెట్టి జక్కన్నతో కలిసి వర్క్ చేయడం కోసం ఇష్టపడుతూ ఉంటారు.
అయితే స్టార్ ఇమేజ్ ఉండి బిజీగా ఉన టెక్నిషియన్స్ మాత్రం రాజమౌళి సినిమా కంటే ఇతర సినిమాలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఆర్ఆర్ఆర్ మూవీ యాక్షన్ కోసం ముందుగా సౌత్ లో స్టార్ స్టంట్ మాస్టర్స్ అయిన రామ్ లక్ష్మణ్ ని తీసుకున్నారు.
అయితే వీళ్ళిద్దరు కొద్ది రోజుల తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.తాజాగా దీనిపై వారు క్లారిటీ ఇచ్చారు.రాజమౌళితో గతంలో మేము సినిమాలు చేసాం.అతని టాలెంట్ చాలా గొప్పది.
ప్రతి విభాగంలో అతని ఆలోచనలు కచ్చితంగా ఉంటాయి.సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో రాజమౌళి ఇమాజినేషన్, స్టైల్ కనిపిస్తుంది.
దీంతో ఎవరైనా అతని ఆలోచనలని అలా అమల్లో పెట్టాల్సిందే తప్ప కొత్తగా వారు చేయడానికి ఏమీ ఉండదు.ఈ కారణంగా సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది.
అలాగే అతని సినిమాలు అంటే సుదీర్ఘంగా వర్క్ చేయాల్సి ఉంటుంది.మాకున్న కమిట్ మెంట్స్ కారణంగా ఎక్కువ రోజులు ఒకే సినిమాకి పని చేయలేము.
ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగింది.ముందు వేగంగా అయిపోతుందని భావించిన కరోనా లాక్ డౌన్ వలన వాయిదా పడటంతో ఇతర సినిమాల కోసం ఇచ్చిన డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది.
దీంతో ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.