ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే పక్క ఇండస్ట్రీ హిట్ కొడతాయి అనే కాన్ఫిడెంట్ తో జనాలందరూ ఆయన సినిమా కోసం ఎదురుచూసేవారు.కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది అసలు ఆడియన్స్ తో సంబందం లేకుండా వర్మ సినిమాలు తీస్తూ రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు.

అయితే వర్మ నాగార్జున తో చేసిన గోవిందా గోవిందా సినిమా టైంలో రైటర్ కొమ్మనపల్లి గణపతిరావు గారు ఆయన దగ్గర రైటర్ గా చేసేవారు అయితే వెంకటేశ్వర సామి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం తో ఈ సినిమా టైటిల్ ఏం పెడుదాం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అందరూ తల ఒక టైటిల్ చెబుతుంటే వర్మ కి మాత్రం అవేమీ నచ్చడం లేదు అయితే ఎక్కడో విన్న మాట గుర్తుకు వచ్చి ఈ సినిమాకి గోవిందా గోవిందా అని పెడుదాం అన్నారట అప్పుడు కొమ్మనపల్లి గారు ఉండి ఆ టైటిల్ మన సినిమా కి సెట్ అవదు అన్నాడట అది శుభశకనం కాదు అన్నాడట ఎందుకు కాదు అని వర్మ అడిగితే గోవిందా గోవిందా అనే మాటను చనిపోయిన వారి అంతిమ యాత్ర జరుగుతుంటే అంటారు అని అనగానే వర్మ సూపర్ అని అయితే ఈ టైటిలే ఈ సినిమా పెర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పారట… అలా వర్మ మూడ్ ఎప్పుడు ఎలా వుంటుందో ఎవరికి తెలీదు కాబట్టి ఆ టైటిల్ అలా సెట్ చేశారని కొమ్మన పల్లి గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు…

అయితే వర్మకు ఇప్పటికీ మంచి సినిమాలు తీసే సత్తా ఉన్నప్పటికీ తీయకుండా అన్ని ప్లాప్ సినిమాలు తీస్తున్నాడు… వర్మ అంటే ఒకప్పుడు చాలా రెస్పెక్ట్ ఉండేది.ఇప్పుడు ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ ఒకప్పుడు ఆయన దగ్గర ఒక్క సినిమాకి అయిన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలి అని అనుకున్న వారే…








