ఒకప్పుడు శ్రీకాంత్ చిన్న హీరోల్లో పెద్ద హీరో గా ఉండేవాడు హిట్టు ప్లాప్ తో సంభందం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఎప్పుడు బిజీ గా ఉండేవాడు.అయితే చిరంజీవి లాంటి పెద్ద హీరోలు టాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తే శ్రీకాంత్ లాంటి వారు మాత్రం ఎస్ వి కృష్ణ రెడ్డి, ఇవివి సత్యనారాయణ లాంటి మీడియ రేంజ్ డైరెక్టర్లతో వర్క్ చేసేవాడు ఆయన పెద్ద సినిమాలు చేయాలనీ ఎప్పడూ అనుకోలేదు ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు తనకి వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోయేవాడు.

తాను సోలోగా మంచి సక్సెస్ లు కొడుతున్న టైములో కూడా మల్టి స్టారర్ సినిమాలు చేస్తూ ఉండువాడు అలా ఆయన దాదాపు తెలుగు లో ఉన్న అందరి హీరోలతో మల్టి స్టారర్ గా సినిమాలు చేసారు.శ్రీకాంత్ ఎదగకపోవడానికి ఇదే ముఖ్యమైన కారణాలు చాలా మంది అంటూ అంటున్నారు.సక్సెస్ లో లేనప్పుడు ఇంకో హీరో సపోర్ట్ తీసుకొని హిట్ కొట్టడం ఇండస్ట్రీ ల కామన్ కానీ శ్రీకాంత్ పెళ్లి సందడి లాంటి సూపర్ సక్సెస్ ఉన్న కూడా ఎగిరే పావురమా లాంటి సినిమాల్లో జెడి చక్రవర్తి తో యాక్ట్ చేసాడు అలా చేయడం వల్లే శ్రీకాంత్ కి సోలో హీరోగా పెద్దగా అవకాశాలు రాలేదు అనే చెప్పాలి.

అయితే తనకి హీరోగా కెరియర్ ముగిసిపోయి చాలా కలం అయినప్పటికీ రీసెంట్ గా బాలయ్య బాబు నటించిన అఖండ సినిమాలో విలన్ గా చేసి మంచి గుర్తింపు పొందాడు…ప్రస్తుతం కొన్ని సినిమాల్లో విల్లన్ గా చేస్తూనే మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు అలా శ్రీకాంత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా రకాలు పాత్రలు చేస్తూ వైవిద్యం కోసం ట్రై చేస్తున్నాడు ఆయన సమకాలీనుడు అయినా జగపతి బాబు బాట లోనే శ్రీకాంత్ నడుస్తున్నాడు అనే చెప్పాలి…








