టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతను నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
సోషల్ మీడియాలో వ్యంగంగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు.ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో అని కూడా ఆలోచించకుండా వ్యాఖ్యలు చేస్తూ పోతుంటాడు.
అలాగే సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలకు సైతం పట్టించుకోకుండా కొట్టిపారేస్తూ ఉంటాడు.ఈ క్రమంలోనే తనపై మితిమీరి విమర్శలు చేసేవారికీ తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటాడు.
ఇకపోతే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కేజీయఫ్ 2 సినిమా సక్సెస్ గురించి మాట్లాడుకుంటు ఉండగా రామ్ గోపాల్ వర్మ మాత్రం స్టార్ హీరోల రెమ్యునరేషన్ విషయాన్ని బయటకు తెచ్చాడు.కేజీయఫ్ 2 సినీమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆర్జీవీ వరస ట్వీట్లతో చిత్రయూనిట్ పై, అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా తాజాగా కేజీయఫ్ సక్సెస్‌ని స్టార్ హీరోల రెమ్యునరేషన్ తో ముడిపెడుతూ ట్వీట్ చేసి, ఇండస్ట్రీలో మరో వివాదానికి తెరలేపారు ఆర్జీవి.సినిమా మేకింగ్‌పై ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత మంచి చిత్రాలు బయటకు వస్తాయని చెప్పడానికి కేజీయఫ్ 2 సినిమా మంచిది ఉదాహరణ.

అయితే మేకింగ్‌లో ఎంత క్వాలిటీ ఉంటే అంత భారీ సక్సెస్ వస్తుంది.అంతేకానీ స్టార్ హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది వృధా అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.బాలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది.కోలీవుడ్‌లో కూడా అదే పరిస్థితి.అయితే వీటితో పోల్చుకుంటే కన్నడ చిత్రపరిశ్రమలో హీరోల రెమ్యునరేషన్ చాలా తక్కువనే చెప్పవచ్చు.కేజీయఫ్ లాంటి సినిమాలు మినహాయిస్తే అక్కడ చాలా సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతాయి అన్న విషయం తెలిసిందే.
మొత్తానికి ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







