విదేశాలలో మన భారతీయుల హవా ఎక్కువగా ఉంటుంది.చక్కని ప్రతిభాపాటవాలతో మన వారు అక్కడ ఎన్నో రంగాలలో కొలువుదీరియున్నారు.
అందుకే భారతీయులకు ఎక్కడైనా సరే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.స్థానికంగా పేద వారికి సాయం చేస్తూ సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుంటారు మన భారతీయులు.
అగ్ర రాజ్యం అమెరికా, బ్రిటన్ ఇలా ఎన్నో దేశాలలో ఆయా దేశాల అభివృద్ధిలో భారతీయులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.ఇలా ఎంతో మంది పలు దేశాలలో గౌరవంగా, ఎంతో ఉన్నతంగా ఉంటున్నారు.
అయితే కొందరు మాత్రం తులసి వనంలో గంజాయి మొక్కలా వికృత చేష్టలు చేస్తూ భారతీయుల పరువు తీస్తుంటారు.ఈ కోవకు చెందినా వారే డాక్టర్ .కృష్ణ సింగ్.
స్కాట్ ల్యాండ్ లో ఉంటున్న భారత సంతతికి చెందిన డాక్టర్.
కృష్ణ సింగ్ వయసు 72.ఈ వయసులో కృష్ణా, రామ అనో లేక మనుమలు, మనుమరాళ్ళతో ఆడుకోవాల్సిన వ్యక్తి తన వద్దకు వచ్చే మహిళా రోగులతో ఆడుకోవడం మొదలు పెట్టాడు.వారిని లైంఘికంగా వేధిస్తూ ఇబ్బందులు పెట్టేవాడు.మహిళా రోగులకు ముద్దులు ఇస్తూ తాక కూడని ప్రదేశాలలో తాకుతూ అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేసేవాడు.ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే

1983 నుంచీ కృష్ణ సింగ్ వ్యవహార శైలి ఇలానే ఉండేదట.1983 – 2018 మధ్య కాలంలో ఎంతో మంది మహిళ రోగులతో అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసుల విచారణలో తేలిందట.ఈ క్రమంలో 2018 ఓ మహిళ ధైర్యం చేసి బయటకు వచ్చి అతడిపై ఫిర్యాదు చేయడంతో అయ్యగారి భాగోతం మొత్తం బయటపడింది.
దాంతో అతడిని అరెస్ట్ చేసిన స్కాట్ ల్యాండ్ పోలీసులు అతడిపై వచ్చిన సుమారు 50 కి పైగా ఫిర్యాదులను పరిశీలించి అరెస్ట్ చేశారు.కాగా ఈ వైద్యం ఓ ప్రత్యేకమైనదని, దీనిని తాను భారత్ లో నేర్చుకున్నానని నేను ఎలాంటి తప్పు చేయలేదంటూ చెప్పినా ఫలితం లేకపోయింది.
త్వరలో అతడి శిక్ష పడే అవకాశం ఉంద







