సాధారణంగా రాంగోపాల్ వర్మ( Ram gopal varma ) అంటే ఒకప్పుడు సినిమాలు తీయడం లో ఆయన ఒక తోపు డైరెక్టర్, కానీ ఇప్పుడు కాంట్రవర్సీ చేయడం లో తోపు అనే చెప్పాలి ఆయనకి ఏం అనిపిస్తే అది మాట్లాడుతాడు, ఏం చేయాలి అనిపిస్తే అది చేస్తాడు.ఎందుకు ఆయన అలా అయ్యాడు అంటే లైఫ్ ఉన్నదే చాలా తక్కువ కాలం దాన్ని ఏ హద్దులు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా బతికి చచ్చిపోవాలన్నది ఆయన డ్రీం, అయితే అందులో భాగంగానే ఆయన తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు.
ప్రస్తుతం ఆయన కొద్దిరోజులుగా మీడియాలో ఎక్కువ గా కనిపించడం లేదు.

అయితే ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది ఏంటంటే ఆయన ఎప్పుడో కృష్ణవంశీ ( Krishnavamsi ) గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్లో చాలా వైరల్ అవుతుంది దాంట్లో కృష్ణవంశీ గురించి ఆయన ఏమని మాట్లాడాడు అంటే కృష్ణవంశీ ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన చేసిన సినిమాలు ఆయన స్థాయి సినిమాలు కావు, ఆయన దగ్గర చాలా స్టఫ్ ఉంది ఆయన దొరకడం తెలుగు సినిమా ఇండస్ట్రీ అదృష్టం అని చెప్పారు.అయితే శివ సినిమా( Shiva movie ) నుంచి తాను డైరెక్టర్ అయ్యేదాకా కృష్ణవంశీ రాంగోపాల్ వర్మ దగ్గరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసారు తన శిష్యుడి మీద ప్రేమ తో వర్మ అలా మాట్లాడటం చూసిన సినీ అభిమానులు చాలా సంతోషం గా ఫీల్ అయ్యారు…

ఇక ఇది ఇలా ఉంటె కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన రంగమార్తాండ సినిమా ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది.ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తుంది.కృష్ణవంశీ చాలా రోజుల గ్యాప్ తరువాత చేసిన సినిమా కావడం వల్ల రిలీజ్ కి ముందే ఈ సినిమా మీద అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండటం తో రిలీజ్ తరువాత మంచి పేరు తెచ్చుకుంది .ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు ఈ సినిమా మీద వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు…
.







