అమీర్ ఖాన్ తో విభేదాలు రావడానికి మీడియానే కారణమంటున్న ఆర్జీవీ..!

వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరొకరి మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.అవసరం ఉన్న లేకపోయినా అన్ని విషయాల్లో స్పందిస్తూ తనదైన శైలిలో మాటలు తూటాలుగా సంధిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 Ram Gopal Varma Comments On Aamir Khan, Aamir Khan, Ram Gopal Varma, Social Medi-TeluguStop.com

ఒకప్పుడు మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన ఆర్జీవీ ఇప్పుడు అన్ని బి గ్రేడ్ సినిమాలు తీస్తూ వరస ప్లాప్స్ అందుకుంటున్నాడు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ అమీర్ ఖాన్ తో తన విభేదాలకు కారణం ఏంటో తెలిపాడు.

ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఒక సమయంలో ఆర్జీవీ అమీర్ ఖాన్ ను ఏమీ అనకపోయినా ఎదో అన్నట్టు ప్రచారం జరిగింది.

దీంతో అప్పటి నుండి అమీర్ ఖాన్ కు ఆర్జీవీ కు మాటలు లేవట.తాజాగా ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

Telugu Aamir Khan, Clashesrgv, Ram Gopal Varma, Ramgopal, Rangeela-Movie

నాగార్జున తో తీసిన శివ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపుకు మళ్లింది.రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ సినిమాలు తీసాడు.ఆయన తీసిన రంగీలా మూవీ కూడా హిందీలో చాలా పెద్ద హిట్ అయ్యింది.

ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించాడు.అయితే ఈ సినిమా తర్వాత ఆర్జీవీ కు అమీర్ ఖాన్ కు మధ్య విభేదాలు వచ్చాయట.
తాజాగా ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.ఒక ఇంటర్వ్యూ లో ఆర్జీవీ అమీర్ ఖాన్ ను తక్కువ చేసి మాట్లాడినట్టు ప్రచారం జరిగి ఆ విషయం కాస్తా అమీర్ వరకు చేరిందట.

దీంతో అమీర్ ఖాన్ రామ్ గోపాల్ వర్మను బ్లాక్ చేసాడట.కానీ ఆర్జీవీ అమీర్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదట.కానీ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

రామ్ గోపాల్ వర్మ రంగీలా సినిమాలో ఒక సన్నివేశం గురించి మాట్లాడుతూ సహా నటుడి టైమింగ్ వల్ల అమీర్ డైలాగ్ బాగా చెప్పాడని వర్మ అన్నదాత.

కానీ ఆ విషయాన్నీ తర్వాత రోజు పేపర్లో అమీర్ కన్నా సహా నటుడు బాగా చేసాడని వేయడంతో ఆ వార్త అమీర్ వరకు చేరి ఆర్జీవీ ని బ్లాక్ చేసాడట.మీడియా కారణంగానే మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ఆర్జీవీ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube