ఇండస్ట్రీలో ఒక నానుడి ఉంది పక్కవాళ్ళను ఎదగనివ్వరు అని.కానీ అది అందరి విషయంలో కాదు రాంగోపాల్ వర్మ, సుకుమార్ లాంటివారు అందుకు ఖచ్చితంగా విరుద్ధమనే చెప్పాలి.
తన దగ్గర పని చేసే అసిస్టెంట్ ని దగ్గరుండి ఎంకరేజ్ చేయడంలో రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) ఎప్పుడూ ముందుంటాడు.దాదాపు ఆయన శిష్యరికంలో వచ్చిన 12 మంది అసిస్టెంట్ దర్శకులు నేడు దర్శకులుగా మారిపోయారు.
ఇది టాలీవుడ్ లో ఖచ్చితంగా ఒక రికార్డు లాంటిదే.ఇంత పెద్ద స్టార్ దర్శకుడైన అతను అసిస్టెంట్ డైరెక్టర్( Assistant directors ) అవుతాడు అంటే కూల్ గా సపోర్ట్ చేయడం జరగని పని.మరి రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసి దర్శకులుగా మారిన ఆ 12 మంది ఎవరో తెలుసుకుందాం.
తేజ
శివ సినిమాకి అసిస్టెంట్ గా వర్మ దగ్గర చేరిన తేజ ( Director Teja ) ఆ తర్వాత కెమెరామెన్ గా మారి ఆ తర్వాత చిత్రం సినిమా ద్వారా దర్శకుడుగా ఎదిగారు.
కృష్ణవంశీ
వర్మ ప్రియ శిష్యుడైన కృష్ణవంశీ సైతం గులాబీ అనే సినిమా ద్వారా తొలిసారిగా దర్శకుడుగా మారారు ఇతడు కూడా శివా సినిమాకు ఏడిగా పని చేశాడు.
గుణశేఖర్
వర్మ శిష్యరికంలో నుంచి వచ్చిన వాడే గుణశేఖర్ సైతం.శివ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాకి దర్శకుడుగా మారాడు.
పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ మొదట వర్మ దగ్గరే శిష్యరికం చేశాడు ఆ తర్వాత ఆ పలుచోట్లలో పని చేసి బద్రి వంటి సినిమాకు దర్శకుడుగా మారాడు ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.
శివ నాగేశ్వర రావు
1993 లో వచ్చిన మనీ సినిమాకు దర్శకుడుగా పని చేశాడు శివ నాగేశ్వరరావు చాలా ఏళ్ల పాటు వర్మ దగ్గరే ఉన్న ఇతడు విజయవంతమైన సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఇ.నివాస్
1999లో షూల్ అనే ఒక హిందీ సినిమాకు దర్శకత్వం వహించాడు నివాస్. ఇతను కూడా వర్మ దగ్గర శిష్యరికం చేసిన వాడే కావడం విశేషం.
వి వి వినాయక్
2002లో ఆది సినిమాస్ తో తొలిసారి దర్శకుడుగా మారాడు వి వి వినాయక్. ఇతడు వర్మ దగ్గర అసిస్టెంట్ గా మారి పలు సినిమాలకు పని చేశాడు.
అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ లో పల సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనురాగ్ కశ్యప్ కూడా వర్మ శిష్యుడే.పాంచ్ అనే సినిమాకు తొలిసారిగా అనురాగ దర్శకత్వం వహించిన అది విడుదలకు నోచుకోలేదు.
అజయ్ భూపతి
ఆర్ఎక్స్ 100 వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకుడుగా పని చేశాడు అజయ్ భూపతి ఇతడు కూడా వర్మ శిష్యరికంలో రాటుతెలిన వాడే.
ఏం జీవన్
బెల్లం వంటి ఒక సినిమాతో దర్శకుడుగా మారిన జీవన్ ప్రసాదం ఇండస్ట్రీలో అయితే పనిచేయడం లేదు కానీ ఇతడు కూడా వర్మ శిష్యుడే.
ఎస్ గోపాల్ రెడ్డి
రవితేజ తో ఉన్న ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ వంటి ఒక అద్భుతమైన సినిమాలు తీశాడు ఎస్ గోపాల్ రెడ్డి ఇతడు దర్శకుడుగా మారక ముందు వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు.
సిద్ధార్థ్ తటోలు
భైరవ గీత అనే చిత్రానికి దర్శకుడుగా పనిచేశాడు సిద్ధార్థ తటోలు.ఇతడు కూడా ఒకప్పుడు వర్మ శిష్యుడే.